- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Deepika Padukone: ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదు దయచేసి ప్రచారం చేయకండి: దీపికా పదుకొణె
దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె(Deepika Padukone) చివరిగా ‘కల్కి2898ఏడీ’(Kalki 2898 AD) సినిమాలో నటించింది. ఆ తర్వాత ప్రెగ్నెన్సీ కారణంగా సినిమాలకు దూరం అయింది. సెప్టెంబర్ 8వ తేదీన ఆమెకు కూతురు జన్మించింది. ఇటీవల ఆ చిన్నారికి దువా పదుకొణె సింగ్(Dua Padukone Singh) అని నామకరణం కూడా చేశారు. అయితే దీపికా నటించిన మూవీ ‘సింగం అగైన్’(Singam Again) నవంబర్ 1న విడుదలై పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. ప్రజెంట్ దీపికా సోషల్ మీడియా(Social Media)కు కూడా దూరంగా ఉంటూ మాతృత్వాన్ని ఎంజాయ్ చేస్తోంది. ఈ క్రమంలో.. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొని ఆసక్తికర కామెంట్స్ చేసింది.
‘‘జీవితం అంటే అనుభవాల సమాహారం. అందులో కొన్ని చేదుగా ఉంటే, కొన్ని తీపిగా ఉంటాయి. ప్రస్తుతం నేను అమ్మగా తీయనైన అనుభూతిని ఎంజాయ్ చేస్తున్నాను. ఇక నటిగా నా బాధ్యతను నిర్వర్తించాల్సిన సమయం ఆసన్నమైంది. అందుకే ఓవైపు కథలు కూడా వింటున్నా. ‘కల్కి2898ఏడి’(Kalki 2898 AD) తర్వాత సౌత్ నుంచి కొన్ని ఆఫర్లు వచ్చాయి. కానీ నా స్థాయికి తగ్గట్టుగా అవి లేవు. అందుకే నేను అంగీకరించడం లేదు. సరైన కథలు వస్తే తప్పకుండా మళ్లీ సౌత్ సినిమాల్లో నటిస్తా.
అయితే గత కొద్ది రోజుల నుంచి కొన్ని వార్తలు చూస్తున్నాను. అందులో నేను పారితోషికం ఎక్కువగా డిమాండ్ చేస్తున్నానని ఓ వార్త బాగా ట్రోల్ అవుతున్నది. కానీ ఇందులో ఎలాంటి నిజం లేదు దయచేసి ప్రచారం చేయకండి. ‘కల్కి2898ఏడీ’(Kalki 2898 AD) కి ఏకంగా 10 కోట్లు తీసుకున్నాను అని రాస్తున్నారు. అవాస్తవాలు ప్రచారం చేయడం వల్ల వాళ్లకు వచ్చేదేంటో నాకైతే అర్థం కావడం లేదు. కథ, పాత్ర నచ్చితే.. రెమ్యునరేషన్(Remuneration) గురించి నేను పట్టించుకోనని నాతో వర్క్ చేసిన నిర్మాతలకు తెలుసు’’ అని చెప్పుకొచ్చింది.
Read More...
Sai Pallavi: అది చూసినప్పుడు నాకు చాలా బాధ కలిగింది.. సాయి పల్లవి ఎమోషనల్ కామెంట్స్