- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
వారి ప్రేమ వేరే అబ్బా.. యంగ్ హీరో నవీన్ పొలిశెట్టి ఇంట్రెస్టింగ్ ట్వీట్

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ యంగ్ హీరో నవీన్ పొలిశెట్టి(Naveen Polishetty) మనందరికీ సుపరిచితమే. 'ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ'(Agent Sai Srinivasa Athreya) సినిమాతో హీరోగా పరిచయమైన ఆయన.. 'జాతి రత్నాలు'(Jathirathnalu) చిత్రంతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. 2023లో 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి'(Miss Shetty Mrs Polishetty) మూవీతో మరో హిట్టు కొట్టి హ్యాట్రిక్ విజయాలను తన అకౌంట్‌లో వేసుకున్నాడు. అయితే కెరీర్ పీక్స్‌లో ఉన్నప్పుడే నవీన్ దురదృష్టవశాత్తూ ఓ యాక్సిడెంట్‌కు గురయ్యాడు.
దీంతో కొన్నాళ్ళు షూటింగ్స్ దూరమయ్యారు. అయితే ఏడాదిన్నరగా బిగ్ స్క్రీన్ మీద కనిపించలేదు. అయితే ఇప్పుడు మళ్లీ ప్రేక్షకులను అలరించడానికి వచ్చేస్తున్నాడు. ప్రస్తుతం నవీన్ పోలిశెట్టి 'అనగనగా ఒక రాజు'(Anaganaga Oka Raju) అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. మీనాక్షి చౌదరి(Meenakshi Chowdary) హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాకు కళ్యాణ్ శంకర్(Kalyan Shankar) దర్శకత్వం వహిస్తున్నాడు.
అయితే పిడివి ప్రసాద్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ సంస్థల నిర్మాతలు సూర్యదేవర నాగ వంశీ, శ్రీమతి సాయి సౌజన్యలు నిర్మిస్తున్నారు. ఈ చిత్రం 2026 సంక్రాంతి స్పెషల్‌గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు ఇప్పటికే మూవీ టీమ్ అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే బేసిక్‌గా 2021లోనే ఈ మూవీ స్టార్ట్ అయింది. అప్పట్లో ఓ గ్లింప్స్ కూడా వదిలారు. అయితే నవీన్ యాక్సిడెంట్ కారణంగా సినిమా లేట్ అయింది. తిరిగి మళ్ళీ సెట్స్ మీదకు తీసుకొచ్చి స్పీడ్‌గా షూటింగ్ చేస్తున్నారు.
గోదావరి జిల్లాలోని అందమైన లొకేషన్స్‌లో షూట్ చేస్తున్నారు. అక్కడ అభిమానుల నుంచి పోలిశెట్టికి గ్రాండ్ వెల్కమ్ లభించింది. 'ఏందబ్బా ఈ ప్రేమ' అంటూ దీనికి సంబంధించిన వీడియోను చిత్ర బృందం సోషల్ మీడియాలో షేర్ చేశారు. సినిమా షూటింగ్ ఫుల్ స్వింగ్‌లో జరుగుతోందని తెలిపారు. దీనికి నవీన్ స్పందిస్తూ.. ''గోదావరి ప్రేమ వేరే అబ్బా. మేము చాలా సరదాగా షూటింగ్ చేస్తున్నాం. ఈ సినిమా మీకు చాలా బాగా నచ్చుతుంది'' అని పోస్ట్ పెట్టాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Read More..
ఆ సినిమాలో సమంత గెస్ట్ రోల్..? క్యూరియాసిటీ పెంచేస్తున్న న్యూస్