Kubera Movie : " కుబేర " సినిమా టైటిల్ మాది.. మాకు నష్టపరిహారం ఇవ్వాలంటూ డిమాండ్ చేస్తున్న నిర్మాత

by Prasanna |
Kubera Movie :  కుబేర   సినిమా టైటిల్ మాది.. మాకు నష్టపరిహారం ఇవ్వాలంటూ డిమాండ్ చేస్తున్న నిర్మాత
X

దిశ, వెబ్ డెస్క్ : శేఖర్ కమ్ముల ( sekhar kammula ) డైరెక్షన్ లో నాగార్జున (Nagarjuna ) , ధనుష్ ( Dhanush) హీరోయిన్ రష్మిక మందన్న( Rashmika Mandanna ) కీలక పాత్రలో తెరకెక్కబోతున్న మూవీ " కుబేర " ( kubera ) . ఇప్పటికే, ఈ చిత్రం నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్, గ్లింప్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రస్తుతం, కుబేర మూవీ షూటింగ్ జరుపుకుంటుంది. అయితే, ఇప్పుడు కుబేర టైటిల్ వివాదంలో చిక్కుకుంది.

తాజాగా, ఓ నిర్మాత కుబేర ( kubera ) టైటిల్ మాది అంటూ హైదరాబాద్ ప్రెస్ క్లబ్ లో ప్రెస్ మీట్ ను నిర్వహించారు. ఈ మీట్ లో నిర్మాత కరిమకొండ నరేందర్ మాట్లాడుతూ.. " కుబేర టైటిల్ మాది.. మాకు చెప్పకుండా శేఖర్ కమ్ముల తన సినిమాకు పెట్టుకున్నారు. 2023 నవంబర్ లో ‘కుబేర’ టైటిల్ ని రిజిస్టర్ చేయించాను. విరాట్ డైరెక్షన్ లో కుబేర చిత్రాన్ని 90 శాతం పూర్తి చేశాము. టైటిల్ కు ముందు ఇప్పుడుతన పేరును యాడ్ చేసుకుని శేఖర్ కమ్ముల మూవీని తీస్తున్నారు. దీని వలన మాకు చాలా నష్టం వస్తుంది. ఈ టైటిల్ ని ఒకటి కాదు రెండు కాదు మొత్తం 5 భాషల్లో రిజిస్టర్ చేయించాం. టైటిల్ అయినా ఛేంజ్ చేసుకోవాలి లేక మాకు నష్టపరిహారం అయిన ఇవ్వాలని " ఆయన డిమాండ్ చేశారు.

ఈ ప్రెస్ మీట్ లో నిర్మాత, డైరెక్టర్, వారి తరపు న్యాయవాది పాల్గొన్నారు. దీనిపై శేఖర్ కమ్ముల ( sekhar kammula ) కానీ, చిత్ర యూనిట్ కానీ స్పందిస్తారా? లేదనేది చూడాల్సి ఉంది. ఇప్పటి వరకు రిలీజ్ అయిన పోస్టర్స్ లో శేఖర్ కమ్ముల కుబేర అనే రాశారు. ఎందుకంటేఈ కథకి ఈ టైటిల్ అయితేనే కరెక్ట్ అని భావించి ఆ పేరును యాడ్ చేసి టైటిల్ రిజిస్టర్ చేయించినట్టు తెలుస్తుంది.ఇప్పటికే వాయిదా పడిన ఈ చిత్రం టైటిల్ వివాదంతో మళ్ళీ పోస్టుపోన్ అవుతుందా ? లేక అనుకున్న సమయానికి సినిమాని మేకర్స్ రిలీజ్ చేస్తారా ? లేదా అని ఇప్పుడు ప్రశ్నర్ధకంగా ఉంది.

Next Story

Most Viewed