- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
వచ్చేసిన రష్మిక మందన్న ‘సికిందర్’ టీజర్.. యాక్షన్, మాస్ డైలాగ్స్‌తో హైప్ పెంచేశారుగా..

దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్(Salman Khan) నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘సికందర్’ (Sikandar). ఎ ఆర్ మురుగదాస్(AR Murugadas) దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రష్మిక మందన్న(Rashmika Mandanna) హీరోయిన్‌గా నటిస్తుండగా.. కాజల్ అగర్వాల్(Kajal Agarwal) కీ రోల్ ప్లే చేస్తుంది. ఇక ఈ మోస్ట్ అవైటెడ్ మూవీలో సత్యరాజ్(Sathyaraj), శర్మాన్ జోషి(Sharman Joshi), ప్రతీక్ బబ్బర్(Pratheek Babbar) వంటి ప్రముఖులు ప్రత్యేక పాత్రలు పోషిస్తున్నారు. ఇక మాస్ ఎంటర్ టైనర్‌గా వస్తున్న ఈ చిత్రం పై అభిమానులతో పాటు సినీ వర్గాల్లో భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి.
అయితే ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ ఏఆర్.మురుగదాస్ డైరెక్ట్ చేస్తుండటంతో పాటు రష్మిక కూడా నటిస్తుండటంతో ఈ చిత్రంపై అంచనాలు రెట్టింపు అయ్యాయి. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్స్, టీజర్ రిలీజ్ అవగా.. వాటికి సాలిడ్ రెస్పాన్స్ దక్కింది. ఈ క్రమంలో తాజాగా ఈ మూవీ నుంచి మరో టీజర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ టీజర్ కట్ ఆద్యంతం పవర్‌ఫుల్ యాక్షన్‌తో నింపేశారు మేకర్స్.
సల్మాన్ ఖాన్ తనదైన మార్క్ యాక్షన్, డైలాగ్ డెలివరీతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఈ టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉండటంతో ఈ మూవీ థియేటర్లలో ఎప్పుడెప్పుడు వస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. కాగా ఈ సినిమాను మార్చి 28న వరల్డ్‌వైడ్ గ్రాండ్ రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా సికిందర్ టీజర్‌ను చూసేయండి.