వచ్చేసిన ‘బ్రహ్మా ఆనందం’ టీజర్.. కామెడీతో తండ్రీకొడుకులు అదరగొట్టారుగా

by Kavitha |
వచ్చేసిన ‘బ్రహ్మా ఆనందం’ టీజర్.. కామెడీతో తండ్రీకొడుకులు అదరగొట్టారుగా
X

దిశ, సినిమా: నిజ జీవితంలో తండ్రీ కొడుకులైనటువంటి బ్ర‌హ్మానందం, రాజా గౌత‌మ్‌‌లు ప్రస్తుతం వెండితెర‌పై తాత, మ‌నవ‌డి పాత్రలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘బ్రహ్మా ఆనందం’. ఆర్‌.వి.ఎస్ నిఖిల్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ సినిమాని.. స్వధర్మ్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై రాహుల్‌ యాదవ్‌ నక్కా నిర్మిస్తున్నారు. ఇక వెన్నెల కిశోర్‌, ప్రియా వడ్లమాని, ఐశ్వర్య హోలక్కల్‌ కీలక పాత్ర‌లను పోషించారు. కాగా ఈ మూవీ ఫిబ్ర‌వ‌రి 14న‌ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేప‌థ్యంలో చిత్ర బృందం ప్ర‌మోష‌న‌ల్ కార్య‌క్ర‌మాల్లో వేగం పెంచింది. అందులో భాగంగా తాజాగా టీజ‌ర్‌ను విడుద‌ల చేశారు. ఒక నిమిషం 53 సెక‌న్ల నిడివితో ఉన్న ఈ టీజ‌ర్ ప్రేక్షకులను ఎంతగానో ఆక‌ట్టుకుంటోంది.

ఇక టీజర్ చూసినట్లయితే.. వెన్నెల కిశోర్, గౌత‌మ్‌ల కామెడీ అదిరిపోయిందనే చెప్పవచ్చు.అలాగే బ్ర‌హ్మానందం ఎంట్రీతో పాటు ఆయ‌న సీన్స్ బాగున్నాయి. ఫైనల్‌గా ఈ టీజ‌ర్‌లో ఎమోషనల్ సీన్ యాడ్ చేసి సినిమాపై మరింత అంచ‌నాల‌ను పెంచేసింది. దీంతో ఈ చిత్రం కోసం ప్రేక్ష‌కులు ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు.



Next Story

Most Viewed