పెళ్లి ఫొటోలు షేర్ చేసిన స్టార్ హీరోయిన్.. చుక్కల్లో చందమామలా ఉన్నావంటూ నెటిజన్ల కామెంట్స్

by Kavitha |
పెళ్లి ఫొటోలు షేర్ చేసిన స్టార్ హీరోయిన్.. చుక్కల్లో చందమామలా ఉన్నావంటూ నెటిజన్ల కామెంట్స్
X

దిశ, సినిమా: ‘నేను శైలజ’(Nenu Sailaja) సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన కీర్తి సురేష్(Keerthi suresh).. తర్వాత ‘నేను లోకల్’(Nenu Local), ‘మహానటి’(Mahanati), ‘అజ్ఞాత వాసి’(Agnathavasi), ‘దసరా’(Dasara), ‘మిస్ ఇండియా’(Miss India) వంటి సినిమాల్లో నటించి మెప్పించింది. ఇక ‘మహానటి’, ‘దసరా’ చిత్రాలకు అయితే అవార్డులు కూడా వచ్చాయి. అలాగే నిత్యం సోషల్ మీడియా(social Media)లో యాక్టీవ్‌గా ఉంటూ తన అంద చందాలతో అదరహో అనిపిస్తుంది.

ఇక ఈ భామ వ్యక్తిగత విషయానికి వస్తే.. రీసెంట్‌గా తన చిన్ననాటి స్నేహితుడైన ఆంటోని తటిల్‌(antony Thatil)తో వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. ఇక మ్యారేజ్ తర్వాత ‘బేబీ జాన్’(Baby John) సినిమాలో నటించిన ఈ బ్యూటీ.. ఈ మూవీ అంతగా విజయం సాధించలేదు. దీంతో ప్రజెంట్ భర్తతో హనీ మూన్, వేకెషన్స్ అంటూ తెగ ఎంజాయ్ చేస్తుంది. అంతేకాకుండా ఆ ఫొటోస్‌ను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ అభిమానులకు దగ్గరవుతూ ఉంది. ఈ క్రమంలో ఈ భామ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది.

తాజాగా కీర్తి సురేష్ తన ఇన్‌స్టాగ్రామ్(Instagram) వేదికగా కొన్ని ఫొటోస్ షేర్ చేసింది. అందులో తాను పెళ్లి కూతురు అయినటువంటి ఫొటోస్ షేర్ చేస్తూ అదిరిపోయే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ జోడించింది. అలాగే ‘నేను అలంకరించిన కవిత’ అనే క్యాప్షన్ కూడా రాసుకొచ్చింది. దీంతో ఈ పిక్స్ కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇక వాటిని చూసిన నెటిజన్లు ఆకాశంలో చందమామాలా ఉన్నావంటూ కామెంట్స్ చేస్తున్నారు. కాగా ఈ పోస్ట్ పై శ్రియా శరన్(Shriya Saran), కళ్యాణి ప్రియదర్శన్(Kalyani Priyadarshan) వంటి హీరోయిన్స్ కూడా స్పందించడం విశేషం.



Next Story

Most Viewed