- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
ఎట్టకేలకు ప్రియురాలిని పెళ్లి చేసుకున్న స్టార్ డైరెక్టర్.. క్యూట్ కపుల్ అంటున్న నెటిజన్లు

దిశ, సినిమా: ‘డిమోంటి కాలనీ-1,2’(Dimonti Colony 1,2), ‘కోబ్రా’ సినిమాలతో టాలెంటెడ్ డైరెక్టర్‌గా గుర్తింపు తెచ్చుకున్న అజయ్ జ్ఞానముత్తు(Ajay Gnanamuthu) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కెరీర్ స్టార్టింగ్‌లో అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేసిన ఆయన.. ఆ తర్వాత హారర్ థ్రిల్లర్ డిమోంటి కాలనీతో డైరెక్టర్‌గా పరిచయం అయ్యాడు. అయితే ఆయన తన ఫస్ట్ మూవీతోనే అందరినీ భయపెట్టాడు. ఇక ఈ మూవీ తర్వాత లేడీ సూపర్ స్టార్ నయనతారతో కలిసి ‘ఇమైక్కా నొడిగల్’(Imaikkaa Nodigal) అనే సినిమాను తెరకెక్కించాడు జ్ఞానముత్తు. అయితే ఈ సినిమా పెద్దగా ఆడలేకపోయినా అజయ్ టేకింగ్‌కు మాత్రం అందరూ ఫిదా అయిపోయారు.
దీని తర్వాత స్టార్ హీరో విక్రమ్(Vikram)తో కలిసి ‘కోబ్రా’(Kobra)ను తెరకెక్కించాడు. ఇక రీసెంట్‌గా డిమోంటి కాలనీ-2 మూవీతో సూపర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ క్రమంలో ఇతనికి సంబంధించిన ఓ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తాజాగా అజయ్ జ్ఞానముత్తు తన ఇన్‌స్టా వేదికగా ఓ పోస్ట్ పెట్టాడు. అందులో తన ప్రియురాలితో ఏడడుగులు వేసిన ఫొటోలను షేర్ చేస్తూ.. షిమోనా అజయ్ (19.01.2025) అంటూ లవ్ సింబల్ జోడించాడు.
కాగా చెన్నై వేదికగా జరిగిన ఈ వివాహానికి పలువురు సినీ ప్రముఖులు హాజరై నూతన దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు. ఇక కోలీవుడ్ స్టార్ హీరో విక్రమ్ కూడా అజయ్ జ్ఞానముత్తు, షిమోనా రాజ్‌కుమార్‌ల వివాహానికి హాజరై కొత్త జంటను ఆశీర్వదించారు. ప్రస్తుతం వీరి పెళ్లి ఫొటోలు నెట్టింట వైరలవుతున్నాయి. ఇక వీటిని చూసిన పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు నూతన దంపతులకు అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అలాగే క్యూట్ కపుల్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.