- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
Robinhood: బిగ్ సర్‌ప్రైజ్ ఇచ్చిన మేకర్స్.. ‘అది దా సర్‌ప్రైజు’ వచ్చేస్తుందంటూ పోస్ట్

దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ హీరో నితిన్(Nithin), డ్యాన్సింగ్ క్వీన్ శ్రీలీల(Sreeleela) జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘రాబిన్‌హుడ్’(Robinhood). ఈ సినిమాను వెంకీ కుడుముల తెరకెక్కిస్తుండగా.. దీనిని మైత్రీ మూవీ మేకర్స్(Mythri Movie Makers) బ్యానర్‌పై నవీన్ ఎర్నేని, యలమంచలి రవిశంకర్(Ravi Shankar) నిర్మిస్తున్నారు. ఈ మూవీ డిసెంబర్ 25న క్రిస్మస్ కానుకగా థియేటర్స్‌లో విడుదల కాబోతుంది. ఇక రిలీజ్ తేదీ దగ్గర పడుతుండటంతో మేకర్స్ ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు. ఇందులో భాగంగా ఓ సర్‌ప్రైజ్ రాబోతున్నట్లు అధికారిక ప్రకటన విడుదల చేశారు. ఇన్నాళ్ల నుంచి హాట్ ఫొటోలతో సోషల్ మీడియాను షేక్ చేసిన కేతిక శర్మ(Ketika Sharma) ‘రాబిన్‌హుడ్’(Robinhood) చిత్రంలో ఐటమ్ సాంగ్(Item song) చేయబోతున్నట్లు వెల్లడించారు.
ఈ పాట మంగళవారం డిసెంబర్ 10న సాయంత్రం 5:04 గంటలకు విడుదల చేస్తామని అనౌన్స్ చేశారు. అంతేకాకుండా.. ‘రాబిన్‌హుడ్’(Robinhood) సెకండ్ సింగిల్ ‘అది దా సర్‌ప్రైజు’ సాంగ్‌తో కేతిక(Ketika Sharma) స్క్రీన్స్‌ను ఫైర్ చేసేస్తుందని హాట్ పోస్టర్‌ను నెట్టింట పెట్టారు. ఇందులో ఈ హాట్ బ్యూటీ రెడ్ కలర్ స్కర్ట్ ధరించగా.. టాప్ స్థానంలో మల్లెపూలతో కవర్ చేసి నడుము చూపిస్తూ చెమటలు పట్టిస్తుంది. ప్రస్తుతం ఈ పోస్టర్ అందరిలో క్యూరియాసిటీని పెంచుతోంది. అయితే నితిన్, వెంకీ కాంబోలో ఇప్పటికే వచ్చిన మూవీస్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకోవడంతో ‘రాబిన్‌హుడ్’పై భారీ అంచనాలు నెలకొన్నాయి.
The hottest & the most sizzling surprise of the year - @TheKetikaSharma will set your screens on fire 🌟🔥 #Robinhood Second Single #AdhiDhaSurprisu Song Promo Out Today At 5:04 PM.
— BA Raju's Team (@baraju_SuperHit) December 9, 2024
Full Song Out on December 10th, 5.04 PM ❤🔥
A @gvprakash musical
Lyrics by Academy Award… pic.twitter.com/yEFWMO3epi