IIFA లో సత్తా చాటిన ‘లాపతా లేడీస్’.. ఎన్ని కేటగిరీల్లో స్థానం దక్కించుకుందంటే?

by Hamsa |
IIFA లో సత్తా చాటిన ‘లాపతా లేడీస్’.. ఎన్ని కేటగిరీల్లో స్థానం దక్కించుకుందంటే?
X

దిశ, సినిమా: ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ అవార్డ్స్ వేడుక రాజస్థాన్‌లోని జైపూర్‌లో మార్చి 8,9 తేదీల్లో జరగబోతోంది. దీనికి బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. అయితే ఈ ఏడాది నామినేషన్స్‌లో ‘లాపతా లేడీస్’(Laapataa Ladies) ఏకంగా తొమ్మిది విభాగాల్లో ఎంపికై సత్తా చాటింది. అమీర్ ఖాన్(Aamir Khan), కిరణ్ రావు తెరకెక్కించిన ఈ సినిమా సెలెక్ట్ అయినట్లు అధికారిక ప్రకటన విడుదల కావడంతో అంతా సంతోష పడుతున్నారు. ఈ చిత్రంతో పాటు భూల్ భులయ్యా-3, స్త్రీ-2, కిల్, ఆర్టికల్-370, షైతాన్ నామినేషన్స్‌లో చోటు దక్కించుకున్నాయి. ఉత్తమ దర్శకుడి కేటగిరీలో కిరణ్ రావు, నిఖిల్ నగేష్ భట్, అమర్ కౌశిక్(Amar Kaushik), సిద్ధార్థ్ ఆనంద్, అనీస్ బజ్మీ(Anees Bazmee), ఆదిత్య సుహాస్ ఝుంబాలే నిలిచారు.

ఇక ఉత్తమ నటి కేటగిరీలో నితాన్షి గోయెల్, అలియా భట్(Alia Bhatt), యామీ గౌతమ్, కత్రినా కైఫ్, శ్రద్ధా కపూర్ ఉన్నారు. ఇక ఉత్తమ నటులుగా.. స్వర్ష శ్రీవాస్తవ, రాజ్ కుమార్ రావు, కార్తీక్ ఆర్యన్(Karthik Aryan), అభిషేక్ బచ్చన్, అజయ్ దేవ్‌గన్‌లు పోటిపడుతున్నారు. సపోర్టింగ్ రోల్ కేటగిరీలో ఛాయా కదమ్, విద్యాబాలన్, జ్యోతిక, ప్రియమణి, జాంకీ బోడివాలా నిలవగా.. బెస్ట్ విలన్ విభాగంలో రాఘవ జుయల్, మాధవన్, వివేక్ గొంబలే, అర్జున్ కపూర్ నామినేషన్స్‌లో స్థానం దక్కించుకున్నారు. ఇక ఫీమేల్ సపోర్టింగ్ రోల్ కేటగిరీలో అభిషేక్ బెనర్జీ(Abhishek Banerjee), రవి కిషన్, రాజ్‌పాల్, మనోజ్ పోటీ పడుతున్నారు. ఇక ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ అవార్డ్స్ నామినేషన్స్‌లో ‘లాపతా లేడీస్’ స్థానం దక్కించుకోవడంతో కిరణ్ రావుకు నెటిజన్లు శుభాకాంక్షలు చెబుతున్నారు.

Next Story