- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
భార్యతో స్పెషల్ ఫొటో షేర్ చేసిన మెగా హీరో.. ఇది కదా అసలైన లవ్ అంటూ నెటిజన్ల కామెంట్స్

దిశ, సినిమా: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్(Varun Tej) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ‘ముకుంద’(Mukunda) సినిమాతో ఇండస్ట్రీకి హీరోగా పరిచయం అయిన ఆయన.. ఆ తర్వాత ‘కంచె’(Kanche), ‘లోఫర్’(Loafer), ‘మిస్టర్’(Mister), ‘ఫిదా’(Fidaa), ‘తొలిప్రేమ’(Tholi Prema), ‘అంతరిక్షం’(Antariksham), ‘F2’, ‘గద్దలకొండ గణేష్’(Gaddalakonda Ganesh), ‘F3’, ‘గాండీవ దారి అర్జున’(Gandivdhari Arjuna), ‘ఆపరేషన్ వాలెంటైన్’(Operation Valentine), ‘మట్కా’(Matka) వంటి సినిమాల్లో నటించి మెప్పించాడు. అయితే ఆయన ఖాతాలోకి ఇప్పటి వరకు సరైన బ్లాక్ బస్టర్ హిట్ పడలేదనే చెప్పాలి.
దీంతో సక్సెస్ కోసం ఈ హీరో తెగ కష్టపడిపోతున్నాడు. ఇందులో భాగంగా ఇప్పటి వరకు ఎన్నడూ ట్రై చేయని ఓ కొత్త జానర్‌తో మన ముందుకు రాబోతున్నాడు. ఇటీవల తన బర్త్‌డే సందర్భంగా ‘వీటీ15’ (VT 15) ప్రకటించాడు. ఇండో- కొరియన్ హారర్ కామెడీ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి మేర్లపాక గాంధీ(Merlapaka Gandhi) దర్శకత్వం వహిస్తున్నాడు. ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌తో అసోసియేట్ అవుతూ యూవీ క్రియేషన్స్(UV Creations) ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఇక ఇటీవల వరుణ్ బర్త్‌డే సందర్భంగా ఈ చిత్రం నుంచి ఫస్ట్ లుక్(First Look) పోస్టర్‌ను రిలీజ్ చేసిన విషయం తెలిసిందే.
దీనికి సోషల్ మీడియాలో మంచి స్పందన లభించగా.. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ-ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతోంది. ఇదిలా ఉంటే.. వరుణ్ తేజ్ సొట్టబుగ్గల చిన్నది అయిన లావణ్య త్రిపాఠి(Lavanya Tripathi)ని ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక అప్పటినుంచి ఈ బ్యూటీ తన భర్తతో మ్యారీడ్ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తుంది. అలాగే వరుణ్ కూడా కొంచెం గ్యాప్ దొరికినా వేకెషన్స్‌కు వెళుతూ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. వాటిని సోషల్ మీడియా(Social Media) వేదికగా పంచుకుంటూ ఫ్యాన్స్‌కు ట్రీట్ ఇస్తున్నారు.
ఈ క్రమంలో వరుణ్ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. తాజాగా వరుణ్ తన ఇన్‌స్టా(Instagram) వేదికగా ఓ పోస్ట్ పెట్టాడు. సాయంత్రం సంధ్య వేళల్లో ఆరుబయట పడుకున్న వరుణ్ మీద అక్కడే పక్కనే ఉన్న లావణ్య తన భర్త మోకాళ్ల మీద తన కాలు వేసింది. ఈ ఫొటోని వరుణ్ షేర్ చేస్తూ.. ‘స్టార్ గేజింగ్’(Stargazing) అనే క్యాప్షన్ జోడించాడు. దీంతో ఈ పోస్ట్ కాస్తా నెట్టింట వైరల్‌గా మారింది. ఇక దీన్ని చూసిన నెటిజన్లు ఇది కదా అసలైన లవ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.