బోల్డ్ లుక్‌లో దర్శనమిచ్చి షాక్ ఇచ్చిన మెగా కోడలు.. ఇది నెవర్ ఎక్స్‌పెక్టెడ్ అంటూ నెటిజన్ల కామెంట్స్

by Kavitha |   ( Updated:2025-03-08 15:28:59.0  )
బోల్డ్ లుక్‌లో దర్శనమిచ్చి షాక్ ఇచ్చిన మెగా కోడలు.. ఇది నెవర్ ఎక్స్‌పెక్టెడ్ అంటూ నెటిజన్ల కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: సొట్టబుగ్గల చిన్నది లావణ్య త్రిపాఠి(Lavanya Tripathi) గురించి స్పెషల్‌గా చెప్పనక్కర్లేదు. ‘అందాల రాక్షసి’(andala Rakshasi) సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ.. తన ఫస్ట్ మూవీతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. తన నటనతో ఫుల్ మార్కులే కొట్టేసింది. దీంతో వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. అలా వచ్చిన అన్ని సినిమాల్లో నటించి మెప్పించింది. ఇక కెరీర్ పీక్స్‌లో ఉన్నప్పుడే మెగా హీరో ప్రిన్స్ వరుణ్ తేజ్(Varun Tej)తో పీకల్లోతు ప్రేమలో పడ్డది ఈ అమ్మడు.

అలా కొన్నాళ్లు సీక్రెట్‌గా లవ్ చేసుకున్న ఈ జంట గతేడాది పెళ్లి కూడా చేసుకున్నారు. ఇక మ్యారేజ్ తర్వాత భర్తతో వేకెషన్స్‌కి వెళుతూ ఫుల్ ఎంజాయ్ చేస్తుంది. అయితే పెళ్లి తర్వాత ఈ బ్యూటీ ‘మిస్ పర్‌ఫెక్ట్’(Miss Perfect) అనే వెబ్ సిరీస్‌లో నటించింది. మళ్లీ మరో సినిమా ప్రకటించలేదు. అయితే రీసెంట్‌గా లావణ్య పుట్టిన రోజు సందర్భంగా ‘సతీ లీలావతి’(Sathi Leelavathi) అనే మూవీలో నటించబోతున్నట్లు తెలిపింది. ఇక ఈ సినిమాలో మలయాళ నటుడు దేవ్ మోహన్ హీరోగా నటిస్తున్నాడు.

ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. కాగా ఈ చిత్రం సమ్మర్‌లో రిలీజ్ కానున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే.. నిత్యం సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ తన వ్యక్తిగత విషయాలను పంచుకుంటూ అభిమానులకు దగ్గరవుతూ ఉంటుంది. ఈ క్రమంలో ఈ భామ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. తాజాగా లావణ్య త్రిపాఠి తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా కొన్ని ఫొటోలు షేర్ చేసింది.

అందులో కొంచెం బోల్డ్ లుక్‌లో దర్శనమిచ్చింది. రెడ్ కలర్ లిప్‌స్టిక్ వేసుకుని కొంచెం హాట్‌గా ఫొటోస్‌కి స్టిల్స్ ఇచ్చింది. ఇక వాటిని షేర్ చేస్తూ స్పార్కిల్, చందమామ ఎమోజీలను జోడించింది.దీంతో ఈ పిక్స్ నెట్టింట వైరల్‌గా మారాయి. ఇక వాటిని చూసిన నెటిజన్లు.. ఎప్పుడూ సంప్రదాయకంగా కనిపించే నువ్వు ఇలా బోల్డ్ లుక్‌లో దర్శనమివ్వడం ఏంటి.. నీ నుంచి ఇది నెవర్ ఎక్స్‌పెక్టెడ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ భామ పోస్ట్ పై మీరు ఓ లుక్ వేసేయండి.


Read Also..

ట్రెడిషనల్ లుక్‌లో ఫిదా చేస్తున్న యంగ్ హీరోయిన్.. సో క్యూట్ అంటూ నెటిజన్ల కామెంట్స్


Next Story

Most Viewed