‘8 వసంతాలు’ నుంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చిన మూవీ మేకర్స్.. ఆకట్టుకుంటున్న పోస్టర్

by Hamsa |   ( Updated:2025-02-26 15:19:15.0  )
‘8 వసంతాలు’ నుంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చిన మూవీ మేకర్స్.. ఆకట్టుకుంటున్న పోస్టర్
X

దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ హీరోయిన్ అనంతిక సునీల్‌కుమార్(Anantika Sunilkumar) ‘మ్యాడ్’ సినిమాతో ఫుల్ ఫేమ్ తెచ్చుకుంది. ప్రస్తుతం ఈ అమ్మడు నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘8 వసంతాలు’(8 Vasantalu). ఈ చిత్రాన్ని ఫణీంద్ర (Phanindra)తెరకెక్కిస్తుండగా.. ఇందులో రవితేజ దుగ్గిరాల, హను రెడ్డి(Hanu Reddy), సంజన, కన్నా పసునూరి, స్వరాజ్ రెబ్బా ప్రగడ, సమీరా కిశోర్(Sameera Kishore) కీలక పాత్రలో కనిపించనున్నారు. అయితే దీనిని మైత్రీ మూవీ మేకర్స్(Mythri Movie Makers) బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు హేషమ్ అబ్దుల్(Hesham Abdul) వహాబ్ సంగీతం అందిస్తున్నారు. అనంతిక ఇందులో శుద్ధి అయోధ్య పాత్రలో నటిస్తుంది. ఓ అమ్మాయి తనకు ఉన్న బాధలు, ఆ బాధల్లోంచి బయటకు వచ్చి మార్షల్ ఆర్ట్స్‌లో ఎలా ఎదిగింది.

అమ్మాయిలు వంటింటికి పరిమితం కాదు అని చెప్పే కాన్సెప్ట్‌తో పాటు బ్యూటిఫుల్ బ్రేకప్‌ స్టోరీతో రాబోతున్న ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, టీజర్, గ్లింప్స్ అందరిలో క్యూరియాసిటీని పెంచిన విషయం తెలిసిందే. మరీ ముఖ్యంగా బ్రేకప్ స్టోరీ కావడంతో యూత్ ఆసక్తి చూపిస్తున్నారు. తాజాగా, చిత్రబృందం ‘8 వసంతాలు’ మూవీకి సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్డేట్‌ ట్విట్టర్ ద్వారా షేర్ చేశారు. ఇందులోంచి ‘అందమా అందమా’ ఫస్ట్ సింగిల్ లిరికల్ వీడియో మార్చి 3వ తేదీన రాబోతున్నట్లు తెలుపుతూ ఓ పోస్టర్‌ను షేర్ చేశారు. ఇందులో హీరోయిన్ నవ్వుతుండగా.. హీరో ఆమెను ప్రేమగా చూస్తున్నట్లుగా కనిపించాడు. ప్రస్తుతం ఈ పోస్టర్ నెట్టింట ఆకట్టుకుంటుంది. ఈ పోస్ట్ ‘‘అందం మీ కళ్ళు చూసే దానికంటే చాలా ఎక్కువ’’ అనే క్యాప్షన్ జత చేశారు.

click for tweet ..






Next Story

Most Viewed