‘మజాకా’ మూవీ ఫస్ట్ సింగిల్ అప్డేట్ ఇచ్చిన మేకర్స్.. ఈ ట్రాక్ వారికోసమేనంటూ ట్వీట్

by Hamsa |
‘మజాకా’ మూవీ ఫస్ట్ సింగిల్ అప్డేట్ ఇచ్చిన మేకర్స్.. ఈ ట్రాక్ వారికోసమేనంటూ  ట్వీట్
X

దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్(Sandeep Kishan), రావు రమేష్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం ‘మజాకా’(Mazaka). త్రినాథ రావు నక్కిన(Trinatha Rao Nakkina) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అన్షు అంబానీ, రితూ వర్మ(Rithu Verma) హీరోయిన్లుగా నటిస్తున్నారు. అయితే ఈ చిత్రాన్ని ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్, హాస్య మూవీస్(Hasya Movies) బ్యానర్స్‌పై రాజేష్ దండా(Rajesh Danda) నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఇందులోంచి వచ్చిన పోస్టర్లు, టీజర్ ప్రేక్షకుల్లో మంచి రెస్సాన్స్‌ను దక్కించుకున్నాయి.

తాజాగా, రిపబ్లిక్ డే సందర్భంగా మూవీ మేకర్స్ ‘మజాకా’ ఫస్ట్ సింగిల్(First single) రాబోతున్నట్లు తెలుపుతూ ప్రకటించి సందీప్ కిషన్ ఫ్యాన్స్‌కు ట్రీట్ ఇచ్చారు. బ్యాచ్‌లర్స్‌కు అల్టిమేట్ సాంగ్‌ను అంకితం చేస్తున్నామంటూ ఓ పోస్టర్‌ను కూడా షేర్ చేశారు. అయితే ఈ సాంగ్‌ను జనవరి 29న ఉదయం 10: 08 గంటలకు విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. అలాగే ‘‘ఒంటరిగా ఉండటంతో విసిగిపోయారా? సింగిల్స్ ఈ పాట మీ కోసమే’’ అనే క్యాప్షన్ జత చేశారు. కాగా, మజాకా మూవీ ఫిబ్రవరి 21న థియేటర్స్‌లో విడుదల కాబోతుంది.



Next Story

Most Viewed