హరిహర వీరమల్లు నుంచి అదిరిపోయే అప్‌డేట్ ఇచ్చిన మేకర్స్.. ఒక అద్భుతమైన అనుభవానికి సిద్ధంగా ఉండండి అంటూ ట్వీట్

by Kavitha |   ( Updated:2025-04-11 07:36:27.0  )
హరిహర వీరమల్లు నుంచి అదిరిపోయే అప్‌డేట్ ఇచ్చిన మేకర్స్.. ఒక అద్భుతమైన అనుభవానికి సిద్ధంగా ఉండండి అంటూ ట్వీట్
X

దిశ, వెబ్‌డెస్క్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan), క్రిష్ జాగర్ల మూడి(Krish Jagarlamudi) కాంబినేషన్‌లో రాబోతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘హరిహర వీరమల్లు’(Harihara Veeramallu). ఇందులో యంగ్ బ్యూటీ నిధి అగర్వాల్(Nidhi Agarwal) హీరోయిన్‌గా నటిస్తుండగా.. బాలీవుడ్ స్టార్ నటుడు బాబీ డియోల్(Bobby Deol) విలన్‌గా కనిపించనున్నాడు. అయితే దీనిని భారీ బడ్జెట్ చిత్రాల నిర్మాత ఏ ఎమ్ రత్నం(AM Rathnam) నిర్మిస్తున్నారు. ఇక షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ మూవీ మే 9న గ్రాండ్‌గా థియేటర్లలోకి రాబోతుంది.

దీంతో ఈ మూవీ నుంచి అప్డేట్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఫ్యాన్స్‌తో పాటు సినీ ప్రేక్షకులు ఈగర్‌గా వెయిట్ చేస్తున్న నేపథ్యంలో తాజాగా ఈ సినిమా నుంచి ఓ క్రేజీ అప్‌డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఓ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేస్తూ.. ‘రీ-రికార్డింగ్, డబ్బింగ్ మరియు VFX పనులు జోరుగా సాగుతున్నాయి—మెరుపు వేగంతో హద్దులు దాటుతున్నాయి.

వేసవిలో అతిపెద్ద సినిమాటిక్ దృశ్యాన్ని మీకు అందించడానికి మేము సిద్ధమవుతున్నాము. హరిహరవీరమల్లు మే 9, 2025న పెద్ద స్క్రీన్‌లలో విడుదల అవుతుంది. ఎప్పుడూ లేని విధంగా ఒక అద్భుతమైన అనుభవానికి సిద్ధంగా ఉండండి’ అంటూ పవన్ కళ్యాణ్ పోస్టర్ రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్టర్ నెట్టింట వైరల్‌గా మారింది.



Next Story

Most Viewed