- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
‘తండేల్’ సెకెండ్ సింగిల్ పై అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన మేకర్స్.. డేట్ అనౌన్స్ చేస్తూ పోస్టర్
దిశ, సినిమా: అక్కినేని నాగ చైతన్య, నేచురల్ బ్యూటీ సాయి పల్లవి జంటగా నటిస్తున్న సినిమా ‘తండేల్’. చందు మొండేటి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం లవ్ అండ్ యాక్షన్ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కుతుంది. అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై బన్నీ వాసు నిర్మిస్తున్న ఈ సినిమా లవర్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 7న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక ఇప్పటికే ఈ మూవీ నుంచి వచ్చిన ప్రతి అప్డేట్ ఆకట్టుకుని ఈ సినిమాపై భారీ అంచనాలను పెంచేశాయి. రీసెంట్‌గా వచ్చిన ఫస్ట్ సింగిల్ వ్యూస్ పరంగా కొత్త ట్రెండ్‌ను సెట్ చేసింది. అలాగే సెంకడ్ సింగిల్ అయిన ‘శివశక్తి’ పై కూడా పోస్టర్ల పరంగా భారీ హైప్ క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే.
అయితే ఈ సాంగ్ గత ఏడాది డిసెంబర్ 22న రిలీజ్ కావాల్సి ఉండగా.. అనుకోని పరిస్థితుల కారణంగా రెండో సింగిల్ విడుదల వాయిదా పడింది. ఈ క్రమంలో తాజాగా న్యూ డేట్‌ను అనౌన్స్ చేస్తూ మేకర్స్ పోస్ట్ పెట్టారు. తండేల్ సెకండ్ సింగిల్ నమో నమ: శివాయ- ది శివశక్తి సాంగ్ జనవరి 4న సాయంత్రం 5 గంటల 4 నిమిషాలకు రాబోతున్నట్లుగా తెలియజేస్తూ.. నాగ చైతన్య, సాయి పల్లవిలు శివపార్వతుల పోజులో ఉన్న ఫొటోను షేర్ చేశారు. కాగా ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించాడు.