- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
పెళ్లైన తొమ్మిది ఏళ్లకు తల్లి కాబోతున్న హీరోయిన్.. ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ అంటూ ఫొటోలు రివీల్
దిశ, వెబ్‌డెస్క్: తెలుగు ప్రేక్షకులకు బాలీవుడ్ నటి ద్రష్టి ధామి ( Drashti Dhami ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బాలీవుడ్లో పలు హిందీ సీరియల్స్‌లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ముఖ్యంగా బుల్లితెరపై ఈమెకు భారీగా ఫ్యాన్స్ ఫాలోయింగ్ పెరిగిపోయింది అని అనడంలో ఏమాత్రం అతియోశక్తి లేదు. అలా ఒకవైపు సీరియల్స్‌లో నటిస్తూనే నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ ఫుల్ బిజీబిజీగా గడుపుతూ ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. ఇక ఆ సంగతి పక్కన పెడితే తాజాగా ఈమె అభిమానులకు ఒక గుడ్‌న్యూస్ తెలిపింది. తాను త్వరలోనే తల్లిని( Mother ) కాబోతున్నట్లు ఈ అమ్మడు ప్రకటించింది. ఇక ఇదే విషయాన్ని సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది. అంతే కాకుండా ‘ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ మై బేబి ఈజ్ కమింగ్.. ఇది చాలా దూరం ఉండదు’ అనే క్యాప్షన్ కూడా జోడించింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన పోస్ట్ నెట్టింట వైరల్ కావడంతో అభిమానులు ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
కాగా ద్రష్టి ధామి 2015లో నీరజ్ ఖేమ్కాను( Niraj Khemka ) పెళ్లి చేసుకుంది.పెళ్లి తర్వాత దాదాపు తొమ్మిది ఏళ్లకు ఈమె గుడ్ న్యూస్ చెప్పడంతో ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తూ పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
(video link credits to dhamidrashti instagram id)