‘అదిదా సర్‌ప్రైజ్’సాంగ్ రీక్రియేట్ చేసిన అమ్మాయిలు.. మీకేం పోయేకాలం వచ్చిందంటూ దుమ్మెత్తిపోస్తున్న నెటిజన్లు

by Hamsa |   ( Updated:2025-03-22 14:17:58.0  )
‘అదిదా సర్‌ప్రైజ్’సాంగ్ రీక్రియేట్ చేసిన అమ్మాయిలు.. మీకేం పోయేకాలం వచ్చిందంటూ దుమ్మెత్తిపోస్తున్న నెటిజన్లు
X

దిశ, సినిమా: టాలీవుడ్ హీరో నితిన్(Nitin), శ్రీలీల (sreeleela) జంటగా నటిస్తున్న లెటేస్ట్ మూవీ ‘రాబిన్‌హుడ్’(robinhood). వెంకీ కుడుముల (venky kudumula) దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్(Mythri Movie Makers) బ్యానర్‌పై నవీన్ ఎర్నేని, రవి శంకర్ (ravi shanker) భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్ఠాత్మంకంగా ఈ సినిమాను నిర్మించారు. అలాగే కేతిక శర్మ (ketika sharma) ఓ స్పెషల్ సాంగ్ లో సందడి చేయనుంది. అలాగే వెన్నెల కిశోర్, రాజేంద్ర ప్రసాద్, దేవదత్తా నాగ, షైన్ టామ్ చాకో, ఆడుకలం నరేన్, మైమ్ గోపి తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.

అయితే ఇందులో భారత స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ (David Warner) కీలక పాత్రలో నటిస్తున్నారు. ఆయన ఫస్ట్ లుక్ కూడా విడుదలైన విషయం తెలిసిందే. దీంతో రాబిన్‌హుడ్‌పై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఇక ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్స్ అన్ని మంచి రెస్పాన్స్‌ను దక్కించుకున్నాయి. మరీ ముఖ్యంగా ఇందులోని ‘అదిదా సర్‌ప్రైజ్’సాంగ్ సోషల్ మీడియాను షేక్ చేసిన విషయం తెలిసిందే.

ఇక ఈ పాటలో కేతిక శర్మ డాన్స్ స్టెప్స్‌తో అందరినీ మంత్రముగ్దులను చేసింది. ఇక ఈ సాంగ్ వచ్చిన కానుంచి పలువురు నెటిజన్లు దానిని రీక్రియేట్ చేస్తూ నెట్టింట రచ్చ చేస్తున్నారు. మరీ ముఖ్యంగా కేతిక ఎలా అయితే మల్లెపూలను ఎదపై వేసుకుని చేసింది అలా కొంతమంది అమ్మాయిలు కూడా చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్ కావడంతో నెట్టింట దారుణంగా కామెంట్స్ చేస్తున్నారు. ఏంది ఈ దరిద్రం, చెండాలమంటూ రాసుకొస్తున్నారు. అలాగే కేతిక శర్మ అంటే డబ్బుల కోసం మరీ మీరంతా ఎందుకు చేశారంటూ దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. మరికొందరైతే పెయిడ్ ప్రమోషన్ అని అంటున్నారు. మీకేం పోయేకాలం వచ్చింది సిగ్గుండాలని దారుణంగా తిట్టిపోస్తున్నారు.

Next Story

Most Viewed