రవితేజ ‘నేనింతే’ సినిమా రీరిలీజ్‌కి డేట్ ఫిక్స్.. పోస్ట్ వైరల్

by Kavitha |   ( Updated:2025-01-02 15:26:29.0  )
రవితేజ ‘నేనింతే’ సినిమా రీరిలీజ్‌కి డేట్ ఫిక్స్.. పోస్ట్ వైరల్
X

దిశ, సినిమా: మాస్ మహారాజ్ రవితేజ సినీ ఇండస్ట్రీలోకి ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చి తన నటనతో ప్రస్తుతం స్టార్ హీరోగా రాణిస్తున్నాడు. ఫ్లాప్స్, హిట్స్ అంటూ సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. అయితే ఇతనికి స్టార్టింగ్‌లో చిన్న చిన్న రోల్స్ చేసినా అంతగా గుర్తింపు రాలేదు. అలా ఫస్ట్ టైం కృష్ణవంశీ తెరకెక్కించిన ‘సింధూరం’ సినిమాలో నటుడు బ్రహ్మాజీతో పాటు సెకండ్ హీరోగా చేశారు. ఇక తన ఫస్ట్ మూవీతోనే మంచి ఫేమ్ సంపాదించుకున్నాడు.

దీంతో వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. అలా వచ్చిన అవకాశాలన్నింటినీ సద్వినియోగం చేసుకుంటూ ఇప్పటికీ యంగ్ హీరోలకి పోటీ ఇస్తున్నాడు. ఈ క్రమంలో ఓ న్యూస్ నెట్టింట వైరల్‌గా మారింది. కొన్నాళ్లుగా సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోల సూపర్ హిట్ సినిమాలు రీ రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా మాస్ మహారాజా రవితేజ, డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబోలో వచ్చిన డిజాస్టర్ మూవీ అయినటువంటి ‘నేనింతే’ చిత్రాన్ని రీ రిలీజ్ చేయనున్నారు.

దాదాపు పదిహేనేళ్ల తర్వాత ఈ మూవీ మరోసారి థియేటర్లలో సందడి చేయనుంది. ఇందులో భాగంగా ఈ సినిమా రవితేజ బర్త్‌డే సందర్భంగా జనవరి 26న రాబోతున్నట్లు తెలియజేస్తూ మేకర్స్.. మూవీ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. కాగా ఈ చిత్రంలో రవితేజ సరసన శియా గౌతమ్ హీరోయిన్‌గా నటించింది. అలాగే ఇందులో బ్రహ్మానందం, వేణుమాధవ్, సుప్రీత్, సుబ్బరాజు కీలక పాత్రల్లో నటించారు. అయితే ఈ సినిమా కమర్షియల్ హిట్ కాకపోయినా.. డైరెక్టర్ పూరి మేకింగ్, రవితేజ యాక్టింగ్ మాత్రం సినీ ప్రియులను కట్టిపడేసిందనే చెప్పుకోవాలి.


Click Here For Tweet..

Advertisement

Next Story