పవన్ కళ్యాణ్ నుంచి ఆ హ్యాబిట్ నేర్చుకోవాలి.. యంగ్ హీరోయిన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

by Kavitha |
పవన్ కళ్యాణ్ నుంచి ఆ హ్యాబిట్ నేర్చుకోవాలి.. యంగ్ హీరోయిన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
X

దిశ, సినిమా: యంగ్ బ్యూటీ నిధి అగర్వాల్ (Nidhi Agarwal) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సవ్యసాచి(Savyasachi)సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ భామ.. ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) సరసన ‘రాజా సాబ్’(Raja Saab) సినిమాలో నటిస్తోంది. మారుతి(Maruthi) డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమా సమ్మర్ స్పెషల్‌గా ఏప్రిల్ 10న గ్రాండ్‌గా థియేటర్లలో రిలీజ్ కానుంది. అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) సరసన ‘హరిహర వీరమల్లు’(Harihara Veeramallu) సినిమాలో కూడా నటిస్తోంది.

క్రిష్ జాగర్లమూడి(Krish Jagarlamudi) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ చిత్రాల నిర్మాత ఏ ఎమ్ రత్నం(A.M. Ratnam) నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. అటు ఓ పక్కా సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నప్పటికీ నిత్యం సోషల్ మీడియా(Social Media)లోనూ చాలా యాక్టివ్‌గా ఉంటుంది నిధి. నిత్యం ఏదోక పోస్ట్ చేస్తూ ఫాలోవర్లను ఆకట్టుకుంటుంది. ఈ క్రమంలో ఈ ముద్దుగుమ్మ చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నిధి అగర్వాల్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ఆమె మాట్లాడుతూ.. ‘హరి హర వీరమల్లు సినిమాలో నా పాత్ర ఇప్పటివరకు నేను చేసిన వాటిల్లో అత్యుత్తమమైనది. ఆ పాత్ర కోసం గుర్రపు స్వారీ, క్లాసికల్ డ్యాన్స్‌లో ప్రత్యేక శిక్షణ తీసుకున్నా. కథక్ నేర్చుకున్నాను. నా కల నిజమైంది. అదృష్టవంతురాలిని అనిపించింది. అలాగే హర్రర్ సినిమాలంటే గతంలో భయం ఉండేది. అందుకే ది రాజా సాబ్ చేయాలనుకున్నాను. ఆ మూవీ టీమ్ అంతా ఎంతో ఫన్నీగా ఉంటుంది.

సెట్‌లో స్క్రిప్ట్ చదువుతున్నప్పుడు కూడా అందరం నవ్వుతూనే ఉన్నాం. అయితే హరిహర వీరమల్లు సెట్స్‌లో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ ఎంతో ఏకాగ్రతతో ఉంటారు. యాక్షన్ చెప్పగానే పూర్తిగా లీనమవుతారు. చుట్టూ ఏం జరుగుతున్న పట్టించుకోరు. తన సన్నివేశంపై మాత్రమే దృష్టి పెడతారు. ఈ హ్యాబిట్ పవన్ సార్‌ నుంచి నేను అలవాటు చేసుకోవాలి’ అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం నిధి చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.


Next Story

Most Viewed