పోసాని కృష్ణ మురళి అరెస్ట్‌‌పై తెలుగు నటుడు కీలక వ్యాఖ్యలు

by Gantepaka Srikanth |   ( Updated:18 March 2025 1:09 PM  )
పోసాని కృష్ణ మురళి అరెస్ట్‌‌పై తెలుగు నటుడు కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు(Chandrababu), ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌(Pawan Kalyan)‌లపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో ప్రముఖ నటుడు, వైసీపీ నేత పోసాని కృష్ణ మురళి(Posani Krishna Murali)ని పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఇటీవల గుంటూరులో జడ్జి ఎదుట పోసానిని పోలీసులు పర్చగా.. జడ్జి ఎదుటే ఆయన కన్నీరు పెట్టారు. రెండు, మూడు రోజుల్లో తనకు బెయిల్ రాకపోతే ఇక ఆత్మహత్యే దిక్కంటూ భావోద్వేగానికి లోనయ్యారు. ఇదిలా ఉండగా.. తాజాగా.. పోసాని అరెస్ట్‌పై ప్రముఖ తెలుగు నటుడు శివాజీ(Actor Shivaji) స్పందించారు. తాజాగా ఆయన ఓ సినిమా ప్రమోషన్ కోసం ఇంటర్వ్యూ ఇచ్చారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాజకీయ నాయకుల వ్యక్తిగత జీవితాల జోలికి ఎవరూ వెళ్లకూడదు. అవసరం అయితే.. ఎవరినైతే టార్గెట్ చేసి విమర్శించాలని ఆయా పార్టీల అధిష్టానాలు ఆదేశిస్తాయో.. ఆ ఆదేశాలకు అనుగుణంగా వ్యక్తినే విమర్శించాలి కానీ.. వారి కుటుంబసభ్యుల జోలికి వెళ్లకూడదు. నేనూ కొన్నాళ్లు రాజకీయాల్లో ఉన్నాను.. రాజకీయాల గురించి మాట్లాడాను.. కానీ ఏనాడూ, ఎవనినీ వ్యక్తిగతంగా విమర్శించలేదు. అది సరైన పద్దతి కూడా కాదు అని అని శివాజీ అన్నారు. అంతేకాదు.. ఇక పోసానిని కూడా వేధించింది చాలు. ఆయన రియలైజ్ అవ్వడానికి ఒక అవకాశం ఇవ్వాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. మరోవైపు పోసానికి మార్చి 26 వరకూ కోర్టు రిమాండ్ విధించింది.

Next Story