Megastar Chiranjeevi: పుట్టిన బిడ్డని కళ్ళు తెరిచే లోపలే చిదిమేస్తుంటే వచ్చిన బాధ అది.. చిరంజీవి ట్వీట్‌పై తమన్ రియాక్షన్ (పోస్ట్)

by sudharani |   ( Updated:2025-01-19 11:17:40.0  )
Megastar Chiranjeevi: పుట్టిన బిడ్డని కళ్ళు తెరిచే లోపలే చిదిమేస్తుంటే వచ్చిన బాధ అది.. చిరంజీవి ట్వీట్‌పై తమన్ రియాక్షన్ (పోస్ట్)
X

దిశ, సినిమా: నందమూరి నటసింహం బాలకృష్ణ (Balakrishna), బ్లాక్ బస్టర్ డైరెక్టర్ బాబీ కొల్లి (Bobby Kolli) కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం ‘డాకు మహారాజ్’ (Daku Maharaj). సంక్రాంతి స్పెషల్‌గా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆ మూవీ ఘన విజయాన్ని అందుకుంది. ఈ క్రమంలోనే రీసెంట్‌గా జరిగిన సక్సెస్ మీట్‌లో మ్యూజిక్ డైరెక్టర్ తమన్ (Music Director Taman) ఎమోషనల్ కామెంట్స్ చేశాడు. ‘సక్సెస్ అనేది చాలా గొప్పది. ఎంత డబ్బు పెట్టిన అది దొరకదు. కానీ ఆ విజయం ఇచ్చే ఎనర్జీ ఎంతో బాగుంటుంది. మనం ముందుకు వెళ్లడానికి, ఓ మొట్టు ఎదగడానికి సహాయం చేస్తుంది. నాకు నిజంగా సక్సెస్ లేకపోతే ఫిలిమ్ నగర్‌వైపు కూడా వెళ్లలేము. అంత చిన్న చూపు చూస్తారు. కాబట్టి ఎవరు ఎంత చేసిన ఆ సక్సెస్ కోసమే. అయితే.. ఓ ప్రొడ్యూసర్ విజయాన్ని అందుకుంటే గొప్పగా, నిజంగా, ధైర్యంగా బయటకు చెప్పుకోవాలంటే కూడా చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకుంటే నెగిటివిటీ స్ప్రెడ్ చేసేస్తుంటారు. ఇలా పనికిరాని ట్రోల్స్ అండ్ నెగెటివ్ ట్రెండ్‌లు చేస్తూ ఆ సినిమాని చంపేయకండి’ అంటూ ఎమోషనల్ అయ్యాడు.

ఈ వ్యాఖ్యలపై మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) స్పందిస్తూ.. ‘డియర్ తమన్.. నిన్న నువ్వు మాట్లాడిన మాటలు హృదయాల్ని తాకేలా ఉన్నాయి. ఎప్పుడూ సరదాగా మాట్లాడుతూ ఉండే నీలో ఇంత ఆవేదన ఉండటం నాకు ఒకింత ఆశ్చర్యంగా కూడా అనిపించింది. కానీ మనసు ఎంత కలత చెందితే నువ్వింతగా స్పందించావో అని అనిపించింది. విషయం సినిమా అయినా క్రికెట్ అయినా మరో సామజిక సమస్య అయినా సోషల్ మీడియా వాడుతున్న ప్రతి ఒక్కరు తమ మాటల తాలూకు ప్రభావం ఆ వ్యక్తుల మీద ఎలా ఉంటుందని ఆలోచించాలి. ఎవరో అన్నట్టు మాటలు ఫ్రీ నే, కానీ అవి ఎలా ప్రభావితం అవుతున్నాయి అనేది ముఖ్యం. మనం పాజిటివ్‌గా ఉంటే ఆ ఎనర్జీ మన జీవితాలని కూడా అంతే పాజిటివ్‌గా ముందుకు నడిపిస్తుంది’ అంటూ చెప్పుకొచ్చారు.

ఇక మెగాస్టార్ ట్వీట్‌పై తమన్ (Taman) స్పందిస్తూ.. ‘డియర్ అన్నయ్యా (చిరంజీవి)... మీ మాటలు నాకు కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన.. అన్న భగవద్గీత శ్లోకాన్ని గుర్తు చేశాయి. ఎంత కాదనుకున్నా మనుషులం కదా... ఒక్కోసారి ఆవేదన గుండె తలుపులు దాటి వచ్చేస్తూ ఉంటుంది. పేగు తెంచుకుని పుట్టిన బిడ్డని.. కళ్ళు తెరిచే లోపలే చిదిమేస్తుంటే వచ్చిన బాధ అది. నన్ను అర్ధం చేసుకుని స్పందించిన మీ మాటలు నాకు జీవితాంతం గుర్తు ఉంటాయి. సినిమా ఎప్పటికి బతికి ఉండాలి’ అంటూ ఎమోషనల్‌గా రియాక్ట్ అయ్యాడు.

Read More..

Ram Charan: గొప్ప మనసు చాటుకున్న మెగా హీరో.. గోల్డెన్ హార్ట్ అంటూ నెటిజన్ల ప్రశంసలు (వీడియో)


Click Here For Tweet..

Next Story

Most Viewed