సన్నీ డియోల్ ‘జాట్’ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎన్ని భాషల్లో విడుదల కానుందంటే?

by Hamsa |
సన్నీ డియోల్ ‘జాట్’ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎన్ని భాషల్లో విడుదల కానుందంటే?
X

దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ నటుడు సన్నీ డియోల్(Sunny Deol), టాలీవుడ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని(Gopichand Malineni) కాంబోలో వస్తున్న మోస్ట్ వెయిటెడ్ సినిమా ‘జాట్’(Jaat). ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్(Mythri Movie Makers), పీపుల్ మీడియా ఫ్యాక్టరీ(People Media Factory) సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇందులో రెజీనా కసాండ్రా(Regina Cassandra) లీడ్ రోల్‌లో నటిస్తుండగా.. స్టార్ నటుడు రణ్‌దీప్ హుడా(Randeep Hooda) విలన్‌గా కనిపించనున్నాడు.

అయితే కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు ఎస్ తమన్(Thaman) మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నారు. తాజాగా, ఈ మూవీ విడుదల తేదీని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ‘జాట్’ మూవీ ఏప్రిల్ 10న తెలుగు, హిందీ, తమిళ భాషల్లో విడుదల కాబోతున్నట్లు తెలుపుతూ సన్నీ డియోల్ పవర్ ఫుల్ పోస్టర్‌ను షేర్ చేశారు. ఇందులో ఆయన ఓ పెద్ద పైపు లాంటి పరికరాన్ని పట్టుకుని నడిచి వస్తుండగా.. ఆయన చుట్టూ నోట్లు పైకి ఎగురుతున్నట్లుగా కనిపించాయి. ప్రస్తుతం ఈ పోస్టర్ ప్రేక్షకుల్లో హైప్ పెంచుతోంది.

Next Story