- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
Sukumar – Ram Charan : RC17 సినిమా స్టోరీ వర్క్ మొదలుపెట్టిన సుకుమార్?

దిశ, వెబ్ డెస్క్ : సుకుమార్ డైరెక్షన్ లో పుష్ప 1 ( Pushpa 1 ) , పుష్ప 2 ( Pushpa 2 ) ఎంత పెద్ద విజయం సాధించాయో మనందరికి తెలిసిందే. పుష్ప 2 విడుదలైన తర్వాత సుకుమార్ కొంచం ఫ్రీ అయ్యాడు. పుష్ప 3 ఉంటుంది, కానీ అది ఇప్పట్లో ఉండదని వార్తలు వచ్చాయి. దీంతో సుక్కు, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రాజెక్టు పై వర్క్ మొదలుపెట్టనున్నాడు. గతంలో RC17 ప్రాజెక్టుగా సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా ఓ చిత్రం అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే.
సుకుమార్ – రామ్ చరణ్ కాంబినేషన్లో " రంగస్థలం " ( Rangasthalam) బ్లాక్ బస్టర్ అయిన విషయం తెలిసిందే. దీంతో, వీరి కాంబోపై అంచనాలు భారీగా ఉన్నాయి. ప్రస్తుతం, చరణ్ బుచ్చిబాబు ( Buchi Babu Sana ) డైరెక్షన్ లో RC 16 చేస్తూ బిజీగా అయ్యాడు. ఈ చిత్రాన్ని అనుకున్న సమయానికి కంప్లీట్ చేసి దసరాకు ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇందులో జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తుంది. ఇప్పటికే రెండు షెడ్యూల్స్ పూర్తయాయ్యి. RC16 షూటింగ్ ముగియగానే సుకుమార్ తో చేయనున్నాడు. ఇప్పుడు RC17 స్క్రిప్ట్ రెడీ చేస్తున్నట్టు సమాచారం. స్క్రిప్ట్ వర్క్ స్టార్ట్ చేశాడని, త్వరలో ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా మొదలుపెడతారని సుక్కు సన్నిహితులు అంటున్నారు. అయితే, ఇది పూర్తిగా విలేజ్ బ్యాక్ డ్రాప్ లో ఉంటుందని గతంలో సుకుమార్ చెప్పారు. గేమ్ ఛేంజర్ తో ఫ్లాప్ అందుకున్న రామ్ చర్మం ఈ మూవీతో అయిన రామ్ చరణ్ నెక్స్ట్ లెవెల్ కి వెళ్తాడేమో చూడాల్సి ఉంది.