- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Sukumar: పవర్ఫుల్ పెర్ఫార్మెన్స్ ఇచ్చిన నటుడిపై పొగడ్తల వర్షం కురిపించిన ప్రముక దర్శకధీరుడు..?

దిశ, వెబ్‌డెస్క్: జగదీష్ (Jagadish) దర్శకత్వం వహించిన కోర్టు (Court) మూవీ ప్రస్తుతం మంచి టాక్ సొంతం చేసుకుంటుంది. బాక్సాఫీసు వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తుందని చెప్పుకోవచ్చు. ఈ మూవీని టాలీవుడ్ హీరో నేచురల్ స్టార్ నాని నిర్మించిన విషయం తెలిసిందే. ఈ బ్లాక్ బస్టర్ చిత్రం ఈ నెల (మార్చి) 14 వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చి విపరీతంగా ఆకట్టుకుంటుంది.
కోర్టు రూమ్ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీలో రోషన్ (Roshan) అండ్ శ్రీదేవి (Sridevi) హీరో, హీరోయిన్లుగా నటించి తెలుగు ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకున్నారు. చందు, జాబిలి (Jabili) పాత్రల్లో అద్భుతంగా నటించారు. ఆకట్టుకునే స్టెప్పులతో డ్యాన్స్ వేశారు. ఇక ఈ మూవీలో పోక్సో చట్టం గురించి తెలియని కోణాలను నెటిజన్లకు తెలియజేశారని చెప్పుకోవచ్చు.
కానీ కోర్టు మూవీలో ఎలాంటి డబుల్ మీనింగ్ డైలాగ్స్ లేకుండా క్లీన్‌గా ఉందని చెప్పుకోవచ్చు. లవ్ స్టోరీ అయినప్పటికీ దర్శకుడు జగదీష్ ప్రేక్షకులకు నీట్‌గా చక్కగా చూపించాడు. ఇక ముఖ్యంగా సీనియర్ నటుడు శివాజీ కూడా ఈ మూవీలో భాగం అయిన విషయం తెలిసిందే.
శివాజీ ఎంట్రీ తర్వాతనే కోర్టు మూవీ ఇంట్రెస్టింగ్గా మారిందని ప్రేక్షకుల భావన. సెకాంఢాఫ్ మొత్తం కోర్టు వాదనలతో సాగుతుంది. రోషల్ తక్కువ కులం వాడని జాబిలి బావగా నటించిన శివాజీకి అస్సలు నచ్చడు. దీంతో నటుడు శివాజీ.. రోషన్‌పై పోక్సో కేసు పెడతాడు. హీరోయిన్ను రేప్ చేశాడని కేసులో ఇరికిస్తాడు.
ఇక హీరో తరపున వాదించడానికి లాయర్లు ఎవరూ రారు. శివాజీ పలుకుబడి కారణంగా అంతా ఈయన వైపే మాట్లాడతారు. ఇక అదే సమయంలో లాయర్‌గా ప్రియదర్శి ఎంట్రీ ఇచ్చి.. కోర్టులో చందు తరపున వాదిస్తాడు. అయితే తాజాగా కోర్టు మూవీ వీక్షించిన టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు సుకుమార్ సోషల్ మీడియా వేదిక అయిన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో కోర్టు సినిమా గురించి రాసుకొచ్చాడు. ‘‘ నేను కోర్ట్ సినిమా వీక్షించారు.
ఈ మూవీని ఎంత అద్భుతంగా రాశారు. యువ నటుడు చందుగా నటించిన రోషన్, అలాగే జాబిలిగా నటించిన శ్రీదేవి యాక్టింగ్ సూపర్. వీరి అమాయకత్వం బాగా నచ్చింది. ఇక ప్రియదర్శి లాయర్‌గా అద్భుతంగా నటించాడు. శివాజీ (Shivaji) అయితే పవర్ ఫుల్ పెర్ఫార్మెన్స్ అందించారు. ఇలాంటి కంటెంట్‌తో నడిచే సినిమాకు మద్దతు ఇచ్చినందుకు నానికి చాలా అభినందనలు. అలాగే దర్శకుడు రామ్ జగదీష్.. మొత్తం టీమ్‌కి వందనాలు’’ అంటూ సుకుమార్ పొగడ్తల వర్షం కురిపించారు.
READ MORE ...
అల్లు అర్జున్ను జైల్లో వేస్తే స్పందించావా? వైసీపీ నేత శిల్పా రవికి నెటిజన్ల నిలదీత