Sudigali Sudheer: అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న సుధీర్.. మూడు రోజుల నుంచి హాస్పిటల్‌లో చికిత్స!

by Hamsa |
Sudigali Sudheer: అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న సుధీర్.. మూడు రోజుల నుంచి హాస్పిటల్‌లో చికిత్స!
X

దిశ, సినిమా: బుల్లితెర నటుడు సుడిగాలి సుధీర్(Sudigali Sudheer) మెజీషియన్‌గా మ్యాజిక్ షోలు చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అలా జబర్దస్త్ షోలో ఎంట్రీ ఇచ్చి పలు స్కిర్ట్స్‌తో టీమ్ లీడర్‌గా మారాడు. తన కామెడీతో ఎంతో మంది ప్రేక్షకులను మంత్రముగ్దులను చేశాడు. అంతేకాకుండా యాంకర్‌గా పలు టీవీ షోలు చేయడంతో పాటు సినిమాల్లోనూ క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటించాడు. గత కొద్ది రోజుల నుంచి బుల్లితెరకు దూరం అయ్యాడు. ఇటీవల మళ్లీ ఓ షో ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ప్రస్తుతం సుధీర్ హీరోగా సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే. త్వరలో ‘గోట్’ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. కానీ చాలా రోజులుగా సోషల్ మీడియాలో దూరం అయ్యాడు. ఈ క్రమంలో.. తాజాగా, సుధీర్ ఓ సినిమా ఈవెంట్‌కు గెస్ట్‌గా వచ్చాడు. ధనరాజ్ స్వయం దర్శకత్వంలో రాబోతున్న ‘రామం రాఘవం’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లో నిర్వహించగా.. సుధీర్ కూడా వచ్చాడు.

అయితే ఆయన ఊహించని లుక్‌లో కనిపించి అందరినీ షాక్‌కు గురి చేశాడు. బక్క చిక్కి పోయిన అతను చాలా నీరసంగా కనిపించాడు. ఇక ఈ విషయంపై ధనరాజ్ స్పందించారు.. ‘‘సుధీర్ కి ఆరోగ్యం బాగోలేదు. డైరెక్ట్ హాస్పిటల్ నుంచి నా కోసం వచ్చాడు. మూడు రోజుల నుంచి తనకి మాట్లాడటానికి మాట కూడా రావట్లేదు. నేను సాయంత్రం ఫోన్ చేసి వస్తున్నావా అని అడిగితే వస్తాను అని చెప్పాడు. ఆరోగ్యం బాగోకపోయినా నా కోసం వచ్చాడు. నేను బాగుండాలి అని కోరుకున్న వాళ్ళల్లో సుధీర్ ముందు ఉంటాడు. చాలా మొహమాటం సుధీర్ కి. అతని ఫంక్షన్స్ కి వెళ్ళడానికే ఆలోచిస్తాడు. అలాంటిది నా కోసం వచ్చాడు. మళ్ళీ ఇప్పుడు హాస్పిటల్ కి వెళ్ళాలి కాబట్టి వెంటనే వెళ్ళిపోతాడు’’ అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో ఈ విషయం తెలుసుకున్న అభిమానులు ఆంధోళన చెందుతున్నారు. అసలు సుధీర్‌కు ఏమైంది? హాస్పిటల్‌లో ఎందుకున్నాడు అని పలు రకాలుగా చర్చించుకుంటున్నారు.



Next Story

Most Viewed