‘సూర్య45’ మూవీలో స్టార్ హీరోయిన్ ఫిక్స్.. ఈ కాంబో అస్సలు ఊహించి ఉండరుగా!

by Hamsa |   ( Updated:2025-03-22 14:21:35.0  )
‘సూర్య45’ మూవీలో స్టార్ హీరోయిన్ ఫిక్స్.. ఈ కాంబో అస్సలు ఊహించి ఉండరుగా!
X

దిశ, సినిమా: కోలీవుడ్ స్టార్ సూర్య (suriya) బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్నారు. షూటింగ్స్‌లో పాల్గొనడంతో పాటుగా సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటున్నారు. ప్రస్తుతం సూర్య ‘రెట్రో’ (retro)మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. కార్తీక్ సుబ్బరాజు (karthik subbaraju) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో పూజా హెగ్డే (pooja hegde) నటిస్తుండగా.. ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే సూర్య ఈ మూవీతో పాటు ‘సూర్య-45’సినిమాలోనూ నటిస్తున్నారు. ఆర్ జే బాలాజీ (rj balaji) దర్శకత్వంలో రాబోతున్న ఈ చిత్రాన్ని డ్రీమ్ వారియర్స్ పిక్చర్స్‌పై ప్రభు, ప్రకాష్ బాబు (prakash babu) నిర్మిస్తున్నారు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన తప్ప ఎలాంటి అప్డేట్ రాలేదు.

ఈ నేపథ్యంలో.. తాజాగా, సూర్య-45 మూవీకి సంబంధించిన ఓ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతూ ప్రేక్షకుల్లో క్యూరియాసిటీని పెంచుతోంది. ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమం దిపావళికి జరగనున్నట్లు టాక్. అయితే ఇందులో సూర్య సరసన స్టార్ హీరోయిన్ త్రిష (trisha) హీరోయిన్‌గా నటించనున్నట్లు సమాచారం. ఈ సినిమాకు సంబంధించిన టీజర్‌ను మేకర్స్ ఏప్రిల్ 14కు తీసుకురాబోతున్నట్లు తెలుస్తోంది. సూర్య-45 చిత్రాన్ని జూన్‌లో విడుదల చేసే ప్లాన్‌లో చిత్రబృందం ఉన్నట్లు టాక్. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఓ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది ఇక అది చూసిన వారంతా సూర్య 45 హిట్ అవడం ఖాయమని అంటున్నారు. అయితే వీరిద్దరి కాంబోను అస్సలు ఊహించలేదని అభిప్రాయపడుతున్నారు. సూర్య, త్రిష నటించడం ఇదే మొదటిసారి కాదు. వీరి కాంబోలో వచ్చిన పలు మూవీస్ బాక్సాఫీసు వద్ద చరిత్ర సృష్టించాయనడంలో అతిశయోక్తి లేదు.

Next Story

Most Viewed