- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
బిచ్చగాడిలా మారిన స్టార్ హీరో.. షాకింగ్ వీడియో వైరల్

దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ హీరో, నిర్మాత, డైరెక్టర్ అమీర్ ఖాన్(Aamir Khan) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన ఎన్నో చిత్రాల్లో నటించి ప్రేక్షకులను అలరించడంతో పాటు పలు అవార్డులను కూడా సొంతం చేసుకున్నారు. అలాగే నిర్మాతగా, డైరెక్టర్‌గా సినిమాలు తెరకెక్కించి తన టాలెంట్‌ను నిరూపించుకున్నారు. పలు హిట్స్ తన ఖాతాలో వేసుకున్న ఆయన గత ఏడాది ‘మహారాజ్’(Maharaj) మూవీతో ప్రేక్షకులను అలరించారు. ఓ వైపు నటిస్తూనే నిర్మాతగానూ వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం అమీర్ ఖాన్ ‘అలీబాబా’(Alibaba) మూవీతో రాబోతున్నారు. దీనిని ఆర్‌ఎస్ ప్రసన్న(RS Prasanna) తెరకెక్కిస్తున్నారు.
స్పోర్ట్స్ డ్రామాగా రాబోతున్న ఈ చిత్రాన్ని కిరణ్ రావు(Kiran Rao) నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమా డిసెంబర్ 25న థ్రియేటర్స్‌లోకి రానుంది. ఇదిలా ఉంటే.. తాజాగా, అమీర్ ఖాన్ బిచ్చగాడిలా దర్శనమిచ్చారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఒక అడవి మనిషి వేషంలో ముంబై వీధుల్లో తిరుగుతూ జనాలు బెంబేలెత్తించారు. రాతి యుగానికి చెందిన మనిషిలా పొడవాటి గడ్డం, పొడవాటి జుట్టుతో ఒక వ్యక్తి తన శరీరానికి జంతువుల చర్మాన్ని చుట్టి, కాళ్లకు బూట్లు ధరించి ముంబైలోని రద్దీ వీధుల్లో రోడ్లపై వింత డ్యాన్స్ చేస్తూ పబ్లిక్‌ను షాక్‌కు గురి చేశారు. కొంతమంది ఆయనను చూసి భయపడి పారిపోయారు.
ఇక మరికొందరు మాత్రం అమీర్ ఖాన్‌ను గుర్తుపట్టి వీడియోలను, ఫొటోలను తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో ఈ వీడియోలు ప్రస్తుతం నెట్టింట చర్చనీయాంశంగా మారాయి. స్టార్ హీరో అయిన ఆయన ఇలా మారిపోవడానికి కారణాలేంటో అని తెగ వెతికేస్తున్నారు. ఇలాంటి వేషంతో రోడ్డుపై తిరగడం ఏంటని కొందరు విమర్శలు కూడా చేస్తున్నారు. కాగా, అమీర్ ఖాన్ ఓ యాడ్ కోసం ఇలా రెడీ అయినట్లు తెలుస్తోంది. అయితే ఇదంతా చార్జ్‌డ్ కోకోలా అడ్వటైజ్ కోసం చేసినట్లు సమాచారం. ఇక ఈ విషయం తెలుసుకున్న వారంతా యాడ్ కోసం అంతలా చేయాలా అని రకరకాలుగా స్పందిస్తున్నారు.
To Ye Caveman Amir Khan Tha BC 😲😲
— POSITIVE FAN (@imashishsrrk) January 29, 2025
But Why ? pic.twitter.com/fRgDB6cEhr