Hero: షూటింగ్‌లో గాయపడ్డ స్టార్ హీరో.. ఆందోళనలో ఫ్యాన్స్

by Gantepaka Srikanth |
Hero: షూటింగ్‌లో గాయపడ్డ స్టార్ హీరో.. ఆందోళనలో ఫ్యాన్స్
X

దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్(Bollywood) స్టార్ హీరో అక్షయ్ కుమార్(Akshay Kumar) గాయపడ్డారు. హౌజ్‌ఫుల్-5(Housefull-5) సినిమా షూటింగ్‌లో ఆయనకు స్వల్ప గాయాలైనట్లు సినీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అక్షయ్ స్టంట్స్ చేస్తున్న సమయంలో ఒక వస్తువు ఆయన కంటికి తగిలినట్లు సమాచారం. వైద్య సిబ్బందిని వెంటనే షూటింగ్ స్పాట్‌కు పిలిపించి చికిత్స అందిస్తున్నట్లు తెలుస్తున్నది. వైద్యులు ఆయన్ను కొన్ని రోజుల పాటు రెస్ట్ తీసుకోవాలని చెప్పినట్లు సమాచారం. ఈ ప్రమాద ఘటనపై అక్షయ్ కుమార్ టీమ్ లేదా? చిత్రబృందం స్పందించాల్సి ఉంది. కాగా, తెలుగులో మంచు విష్ణు ప్రతిష్టాత్మక చిత్రమైన కన్నప్ప మూవీలో అక్షయ్ కుమార్ కీలక పాత్రలో కనిపించనున్నారు.




Advertisement

Next Story

Most Viewed