పెళ్లి కాకుండానే ఇద్దరు పిల్లలకు తల్లి అయిన శ్రీ లీల.. కంగ్రాట్స్ చెబుతున్న నెటిజన్లు(పోస్ట్)

by Kavitha |
పెళ్లి కాకుండానే ఇద్దరు పిల్లలకు తల్లి అయిన శ్రీ లీల.. కంగ్రాట్స్ చెబుతున్న నెటిజన్లు(పోస్ట్)
X

దిశ, వెబ్‌డెస్క్: ‘పెళ్లి సందడి’(Pelli Sandadi) సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన యంగ్ బ్యూటీ శ్రీ లీల(Sree Leela) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన ఫస్ట్ మూవీతోనే ఓవర్ నైట్ స్టార్‌గా మారిపోయింది ఈ భామ. దీంతో వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. అలా దాదాపు స్టార్ హీరోలందరి సరసన నటించి మెప్పించింది. ఇక ఈ అమ్మడు డ్యాన్స్‌కి అయితే ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని అనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు.

రీసెంట్ సుకుమార్(Sukumar) డైరెక్షన్‌లో అల్లు అర్జున్(allu Arjun) హీరోగా, రష్మిక మందన్న(Rashmika Mandanna) హీరోయిన్‌గా నటించిన పుష్ప-2(Pushpa-2) మూవీలో శ్రీలీల ‘కిస్సిక్’(Kissik) అనే ఐటెం సాంగ్‌లో చిందులేసింది. ఆ బ్యూటీ డాన్స్‌కి ఫుల్ మార్కులే పడ్డాయి. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ.. రవితేజ(Raviteja) సరసన ‘మాస్ జాతర’, విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) నటిస్తున్న ‘VD-12’, శివ కార్తికేయన్(Sivakarthikeyan) ‘పరాశక్తి’(Parasakthi) మూవీతో పాటు బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్(Saif Ali Khan) కొడుకు ఇబ్రహీం అలీ ఖాన్(Ibrahim Ali Khan) సరసన ఓ హారర్ కామెడీ థ్రిల్లర్ సినిమాలో నటిస్తోంది.

అలా వరుస సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ చదువులోనూ యాక్టీవ్‌గా ఉంటూ తన పై చదువులు పూర్తి చేసుకుంటుంది. అంతేకాకుండా నిత్యం సోషల్ మీడియా(social Media)లోనూ నిత్యం యాక్టీవ్‌గా ఉంటూ అభిమానులకు దగ్గరవుతూ ఉంటుంది. ఈ క్రమంలో ఈ బ్యూటీకి సంబంధించిన ఓ న్యూస్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. వివరాల్లోకి వెళితే..

ముద్దుగుమ్మ శ్రీ లీల ఫిబ్రవరి 2022లో గురు అండ్ శోభిత అనే ఇద్దరు వికలాంగ పిల్లలను దత్తత తీసుకుంది. ఆ సమయంలో ఆమెకు 21 సంవత్సరాలు. శ్రీ లీల ఒక అనాథాశ్రమాన్ని సందర్శించి, వారి పరిస్థితిని చూసిన తర్వాత పిల్లలను దత్తత తీసుకోవాలని నిర్ణయించుకుంది. పిల్లల పరిస్థితి చూసి తాను చలించిపోయానని, జీవితాంతం వారిని దత్తత తీసుకోవాలని నిర్ణయించుకున్నానని ఆమె చెప్పింది. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా.. శ్రీలీల దత్తత తీసుకోవాలనే నిర్ణయం స్ఫూర్తిదాయకమని, కంగ్రాట్స్ అంటూ నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.



Next Story