షాకింగ్ నిర్ణయం తీసుకున్న శ్రీలీల.. ఆ కారణంతో సినిమా ఇండస్ట్రీకి దూరం కానుందా!

by Hamsa |   ( Updated:2024-03-01 11:42:30.0  )
షాకింగ్ నిర్ణయం తీసుకున్న శ్రీలీల.. ఆ కారణంతో సినిమా ఇండస్ట్రీకి దూరం కానుందా!
X

దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ బ్యూటీ శ్రీలీల గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ అమ్మడు పెళ్లి సందడి సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్‌గా మారిపోయింది. అంతేకాకుండా మహేష్ బాబు, బాలకృష్ణ, నితిన్, వైష్ణవ్ తేజ్ వంటి హీరోలతో నటించి మెప్పించింది. తన డాన్స్ నటనతో టాలీవుడ్‌ను ఓ ఊపు ఊపేసింది. మొత్తానికి టాలీవుడ్ హీరోలందరికీ మోస్ట్ వాంటెడ్ బ్యూటీగా మారిపోయింది. అయితే ఇటీవల శ్రీలీల వరుసగా ఫ్లాప్స్ అందుకున్న సంగతి తెలిసిందే. దీంతో సోషల్ మీడియాలో దారుణంగా ట్రోల్స్‌కు గురైంది. ప్రస్తుతం పవన్ కల్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా తప్ప మరే కొత్త ప్రాజెక్ట్‌ను ఓకే చేయలేదు. ఇదిలా ఉంటే.. తాజాగా, శ్రీలీల కీలక నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. ఆమె కొంతకాలంపాటు సినిమాలకు బ్రేక్ ఇవ్వనున్నట్లు సమాచారం.

అసలు విషయంలోకి వెళితే.. శ్రీలీల ఒకవైపు సినిమాలు చేస్తూనే ఎంబీబీఎస్ చదువుతున్న విషయం తెలిసిందే. దీంతో సినిమాలపై సరిగ్గా ఫోకస్ చేయలేక పోతుందట. అందుకే కొత్త ఆఫర్స్ వస్తున్నప్పటికీ తొందర పడి సైన్ చేయడం లేదట. ముందుగా చదువును పూర్తి చేసి ఆ తర్వాత సినిమాలపై ఫోకస్ చేసే ప్లాన్‌లో ఉందట. కాబట్టి ఇకనుంచి సినిమా కంటెంట్, తన రోల్ ఇంపార్టెన్స్ చూసి గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలని డిసైడ్ అయిందట. ఇప్పటివరకూ చేసినట్లుగా బ్యాక్ టూ బ్యాక్ కాకుండా ఈ సారి కంటెంట్‌ను బట్టి ప్రాజెక్ట్ ఒకే చేయాలని చూస్తుందట. ఇందులో నిజమెంత అనేది తెలియదు కానీ ప్రస్తుతం ఈ వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది.

Read More..

సమంత సిగ్గు వదిలేసి ఆ పని చేస్తే, టాలీవుడ్‌లో టాప్ రేంజ్ పక్కానంట!

Advertisement

Next Story

Most Viewed