Sonakshi Sinha: ఇండియాలో బికినీ ధరించాలంటే భయమంటూ సోనాక్షి సిన్హా వివాదాస్పద వ్యాఖ్యలు.. నెటిజన్లు ఫైర్

by Hamsa |   ( Updated:2025-03-03 11:24:02.0  )
Sonakshi Sinha: ఇండియాలో బికినీ ధరించాలంటే భయమంటూ సోనాక్షి సిన్హా వివాదాస్పద వ్యాఖ్యలు.. నెటిజన్లు ఫైర్
X

దిశ, సినిమా: బాలీవుడ్ నటుడు శత్రుష్ను కూతురు సోనాక్షి సిన్హా(Sonakshi Sinha) అందరికీ సుపరిచితమే. ఈ అమ్మడు ‘దబాంగ్’మూవీతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన తన అందం, నటనతో మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించిన ఆమె పెద్దగా ఫేమ్ తెచ్చుకోలేకపోయింది. సోనాక్షి గత ఏడాద కకూడ, బడే మియాన్.. చోటే మియాన్(Bade Miyan Chote Miyan) చిత్రాలతో ప్రేక్షకులను అలరించింది. ఇక ఆమె పర్సనల్ లైఫ్ విషయానికొస్తే.. కెరీర్ పీక్స్‌లో ఉండగానే సోనాక్షి, జహీర్ ఇక్బాల్‌తో కొద్ది కాలంపాటు డేటింగ్ చేసి పెళ్లి చేసుకుంది. తన కుటుంబానికి కూడా చెప్పకుండా ముస్లిం పెళ్లి చేసుకుని అందరికి షాకిచ్చింది. ఇక పెళ్లి తర్వాత నుంచి ఆమె నిత్యం వార్తల్లో నిలుస్తోంది. పలు విమర్శలు ఎదుర్కొంటున్నప్పటికీ అవన్నీ మనసుకు తీసుకోకుండా తన లైఫ్‌ను ఎంజాయ్ చేస్తోంది.

అలాగే తన భర్తతో వెకేషన్స్‌కు వెళ్తూ పలు ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సోనాక్షి వివాదాస్పద వ్యాఖ్యలు చేసి ట్రోల్స్ ఎదుర్కొంటుంది. ‘‘ఇండియాలో నేను అస్సలు బికినీ ధరించను. దేశం బయటకు వెళ్ళినప్పుడు మాత్రమే బికినీ వేసుకుంటాను. ఎందుకంటే ఇక్కడ ఎవరు ఎటు నుంచి ఫొటో తీస్తారోఅనే భయం కలుగుతుంది. అందుకే ఇండియా వదిలి వేరే ప్రదేశానికి వెళ్ళినప్పుడు మాత్రమే బికినీ వేసుకుని స్విమ్మింగ్ చేస్తాను. కానీ ఇండియాలో మాత్రం అలా చేయడానికి అవ్వదు కాబట్టి వేసుకోను’’ అని చెప్పుకొచ్చింది. ఇక సోనాక్షి కామెంట్లు వైరల్ కావడంతో ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు ఆమెపై ఫైర్ అవుతున్నారు. ఇండియా గురించి అలా మాట్లాడటమేంటని మండిపడుతున్నారు. బికినీ వేసుకోను అని.. సోషల్ మీడియాలో ఎలా ఫొటోలు షేర్ చేస్తున్నావని అంటున్నారు.



Next Story

Most Viewed