- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
'జాతి రత్నాలు' డైరెక్టర్‌తో తమిళ్ స్టార్ హీరో.. మొదలైన షూటింగ్
దిశ, సినిమా: 'జాతి రత్నాలు' సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న యంగ్ డైరెక్టర్ అనుదీప్.. ప్రస్తుతం తమిళ్ స్టార్ హీరో శివ కార్తికేయన్‌తో బిగ్ ప్రాజెక్ట్ చేసే ఛాన్స్ కొట్టేశాడు. శివ కార్తికేయన్ 20వ సినిమాగా రాబోతున్న ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినిమాస్, సురేష్ ప్రొడక్షన్స్ కలిసి నిర్మిస్తుండగా.. ఇటీవల సినిమాకు సంబంధించిన ఓ థీమ్ వీడియోను కూడా రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. కాగా నేడు ఈ మూవీ పూజా కార్యక్రమాలు ఘనంగా జరగ్గా.. హీరో శివ కార్తికేయన్, దర్శకుడు అనుదీప్, సత్యరాజ్, దగ్గుబాటి సురేష్ బాబు తదితరులు పాల్గొన్నారు.
ఇక తెలుగు, తమిళ్ భాషలో విడుదల కానున్న ఈ చిత్రాన్ని కామెడీ నేపథ్యంలోనే తెరకెక్కించనున్నట్లు తెలిపిన డైరెక్టర్.. రెగ్యులర్ షూటింగ్ మొదలు పెడుతున్నట్లు తెలిపారు. థమన్ సంగీతం సమకూరుస్తున్న చిత్రానికి త్వరలోనే టైటిల్ ప్రకటించే అవకాశం ఉంది.
#Sivakarthikeyan new movie launched with Jathirathnalu director Anudeep. Music by SS Thaman.
— Censor Buzz (@Censor_Buzz) February 10, 2022