Shooter: ‘షూటర్’ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్.. నెట్టింట ఆకట్టుకుంటున్న ఫస్ట్ లుక్

by Kavitha |
Shooter: ‘షూటర్’ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్.. నెట్టింట ఆకట్టుకుంటున్న ఫస్ట్ లుక్
X

దిశ, సినిమా: శ్రీ వెంకట సాయి బ్యానర్ పై శెట్టిపల్లి శ్రీనివాసులు(Shettipally Srinivasulu) దర్శకనిర్మాణంలో తెరకెక్కుతున్న తాజా సినిమా ‘షూటర్’(Shooter). రవిబాబు(Ravi babu), ఎస్తర్ నోరాన్హా(Esther Noronha), ఆమని(Aamani), రాశి(Rashi), సుమన్(Suman) వంటి ప్రముఖులు ముఖ్య పాత్రల్లో నటించారు. ఇక అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను తాజాగా రిలీజ్ చేసి రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. ఇందులో భాగంగా ‘షూటర్’ మూవీ ఫిబ్రవరి 22న వరల్డ్ వైడ్‌గా థియేటర్స్‌లో రిలీజ్ కానున్నట్లు తెలిపింది.

ఈ సందర్భంగా చిత్ర దర్శక నిర్మాత శెట్టిపల్లి శ్రీనివాసులు మాట్లాడుతూ.. ‘ఓ విభిన్న కథ, కథనంతో షూటర్ సినిమాని తెరకెక్కించాము. రవిబాబు, ఆమని, ఎస్తర్, రాశి.. లాంటి స్టార్స్ ఈ సినిమాలో నటించారు. సుమన్, అన్నపూర్ణమ్మ(Anna Purnamma), సత్యప్రకాష్(Satya Prakash), సమీర్(Sameer), జీవా(Jeeva).. ఇంకా చాలా మంది స్టార్స్ ఉన్నారు. ప్రతి ఫ్రేమ్ కూడా ఆర్టిస్టులతో అద్భుతంగా ఉంటుంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 22న రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం. ఈ సినిమా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఫిబ్రవరి 22న ఈ సినిమా శ్రీలక్ష్మీ పిక్చర్స్ బాపిరాజు గారు ద్వారా రిలీజ్ కానుంది’ అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఆయన చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.


Next Story

Most Viewed