‘శివంగి’ ఫస్ట్ లుక్ విడుదల.. షాకింగ్ లుక్‌లో దర్శనమిచ్చిన యంగ్ హీరోయిన్

by Hamsa |
‘శివంగి’ ఫస్ట్ లుక్ విడుదల.. షాకింగ్ లుక్‌లో దర్శనమిచ్చిన యంగ్ హీరోయిన్
X

దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ హీరోయిన్ ఆనంది(Anandhi) వరుస సినిమాల్లో నటిస్తూ దూసుకుపోతుంది. ఈ అమ్మడు మల్టీ స్టారర్ మూవీ ‘భైరవం’(Bhairavam) చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇందులో బెల్లంకొండ శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ నటిస్తున్నారు. అయితే ఈ సినిమాను విజయ్ కనకమేడల దర్శకత్వంలో తెరకెక్కుతోంది. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ మూవీ త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ క్రమంలో.. ఆనంది ఓ లేడీ ఓరియెంటెడ్ మూవీలో నటిస్తున్నట్లు అధికారిక ప్రకటన విడుదలైంది. దేవరాజ్ భరణి ధరణ్(Devaraj Bharani Dharan) దర్శకత్వంలో వస్తున్న ‘శివంగి’(Shivangi) సినిమాలో ఆనంది, వరలక్ష్మి శరత్ కుమార్(Varalakshmi Sarath Kumar) ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. దీనిని ఫస్ట్ కాపీ మూవీస్ బ్యానర్‌పై సురేష్ బాబు(Suresh Babu) నిర్మించిన పవర్ ఫుల్ విమెన్ సెంట్రిక్ ఫిల్మ్.

ఇందులో డాక్టర్ కోయి కిషోర్, జాన్ విజయ్(John Vijay) కీలక పాత్రలో కనిపించనున్నారు. అయితే ఈ చిత్రానికి కాషిఫ్ ఎబినేజర్ పాల్ మ్యూజిక్ అందిస్తున్నారు. తాజాగా, ‘శివంగి’ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ టాలీవుడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి(Anil Ravipudi) లాంచ్ చేశారు. ఇందులో ఆనంది ఊహించనవి గెటప్‌లో ఉండి అందరినీ ఆశ్చర్యపరిచింది. యాష్ కలర్ లుంగీ, నల్ల చొక్కాతో ధరించిన ఆమె గాగుల్స్ పెట్టుకుని కాలుపై కాలు వేసుకుని సోఫాలో కూర్చుని కనిపించింది. ప్రస్తుతం ఆనంది డైనమిక్‌గా కూర్చున్న స్టన్నింగ్ లుక్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆమె లుక్ అందరిలో క్యూరియాసిటీ పెంచుతోంది. అయితే ఈ మూవీ మార్చి 7న థియేటర్స్‌లోకి రాబోతుంది.



Next Story

Most Viewed