- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Sai Dharam Tej: ఆమె లివర్ సమస్యతో బాధపడుతోంది.. దయచేసి సాయం చేయండంటూ మెగా హీరో పోస్ట్

దిశ, సినిమా: మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్(Sai Dharam Tej) సినిమాలు చేయడంతో పాటు సాయం కోరిన వారికి తన వంతు సహాయం అందిస్తున్నారు. ఇటీవల తనకోసం సెట్‌కు వచ్చిన ఫ్యాన్స్‌కు ఆయన ప్రత్యేకంగా భోజనం చేయించి మరీ కడుపునింపారు. అంతేకాకుండా సోషల్ మీడియా ద్వారా సహాయం కోరిన వారికి కూడా ఆయన అండగా నిలుస్తూ ప్రశంసలు అందుకుంటున్నారు. మామలకు తగ్గ అల్లుడిగా పేరు సంపాదించుకుంటున్నాడు. ఇదిలా ఉంటే.. తాజాగా, సాయి ధరమ్ తేజ్ ఓ పాప లివర్ వ్యాధితో బాధపడుతున్నట్లు తెలుపుతూ ఇన్‌స్టా ద్వారా ఓ నోట్ షేర్ చేశారు. హయా అనే అమ్మాయి జూబ్లీహిల్స్‌లోని అపోలో హాస్పిటల్‌లో ట్రీట్‌మెంట్ తీసుకుంటుంది.
నా వంతుగా నేను ఆమె ట్రీట్‌మెంట్ కోసం సాయం చేశాను. దయచేసి మీరు కూడా ఎంతో కొంత డబ్బును ఇవ్వండి. ప్లీజ్ మీరు చేసే సాయం వల్ల ఆ పాప ప్రాణాలతో ఉంటుంది. ప్రతి డినేషన్ చాలా ముఖ్యమైనది. ఆమె ఓ యోధురాలు.. మీరు సపోర్ట్ చేయడం వల్ల ఆమె ఆ సమస్య నుంచి బయటపడుతుంది’’ అని రాసుకొచ్చాడు. కాగా, సాయి ధరమ్ తేజ్ సినిమాల విషయానికొస్తే.. ‘రేయ్’ మూవీతో ఇండస్ట్రీకి పరిచయం అయి ఫుల్ పాపులారితో మెగా మేనల్లుడిగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నాడు.
ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించి ప్రేక్షకులను అలరించిన ఆయనకు గతంలో యాక్సిడెంట్ కావడంతో.. కొద్ది రోజులు సినిమాలకు గ్యాప్ ఇచ్చాడు. మళ్లీ పవన్(Pawan Kalyan)తో ‘బ్రో’తో రీ ఎంట్రీ ఇచ్చాడు. అదే ఏడాది ‘విరూపాక్ష’ మూవీతో హిట్ అందుకున్నాడు. ప్రస్తుతం ‘సంబరాల ఏటిగట్టు’(Sambarala Yeti Gattu)తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. రోహిత్ కేపీ (Rohit KP)దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమాలో ఐశ్వర్య లక్ష్మి(Aishwarya Lakshmi) హీరోయిన్‌గా నటిస్తుంది. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ వచ్చే ఏడాది విడుదల కానున్నట్లు సమాచారం.