- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
‘తండేల్’ నుంచి సెకండ్ సింగిల్ విడుదల.. ఉగ్రరూపంలో చైతు, సాయిపల్లవి మాస్ స్టెప్స్
దిశ, సినిమా: అక్కినేని హీరో నాగచైతన్య(Naga Chaitanya), సాయి పల్లవి(Sai Pallavi) జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘తండేల్’. దీనిని చందూ మొండేటి(Chandoo Mondeti) తెరకెక్కిస్తున్నారు. గీతా ఆర్ట్స్(Geetha Arts) బ్యానర్‌పై బన్నీ వాసు నిర్మాణంలో రాబోతుంది. ఈ సినిమా నుంచి ఇప్పటికే పోస్టర్స్, టీజర్, బుజ్జి తల్లి(Bujji Thalli) సాంగ్ రిలీజ్ అవగా.. ఫుల్ వ్యూస్‌ను రాబట్టాయి.
అయితే ‘తండేల్’ మూవీ 2024లోనే విడుదల కావాల్సి ఉండగా వాయిదా పడింది. దీంతో ఈసినిమా భారీ అంచనాల మధ్య ఫిబ్రవరి 7న థియేటర్స్‌లోకి రానుంది. తాజాగా, తండేల్ నుంచి సెకండ్ సాంగ్ రిలీజ్ అయింది. ‘నమో నమో నమ: శివాయ’ అని సాగే ఈ పాటలో శివుని భక్తులుగా సాయి పల్లవి, నాగచైతన్య మాస్ స్టెప్స్ వేసి దుమ్మురేపారు. దేవిశ్రీ ప్రసాద్(Devi Sri Prasad) సంగీతం అందించిన ఈ పాటను అనురాగ్ కులకర్ణి(Anurag Kulkarni), హరిప్రియ పాడారు. ప్రస్తుతం శివశక్తి సాంగ్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.
(Video Credit Aditya Music YouTube Channel)