Sandeep Kishan: అది కదా నేను ఆయన నుంచి వినాలి అనుకున్నది.. చిరంజీవిపై యంగ్ హీరో కామెంట్స్

by sudharani |
Sandeep Kishan: అది కదా నేను ఆయన నుంచి వినాలి అనుకున్నది.. చిరంజీవిపై యంగ్ హీరో కామెంట్స్
X

దిశ, సినిమా: సందీప్ కిషన్ (Sundeep Kishan), రీతూ వర్మ (Ritu Varma) జంటగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘మజాకా’ (Mazaka). స్టార్ డైరెక్టర్ త్రినాథరావు నక్కిన (Trinatharao Nakkina) తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో సీనియర్ యాక్టర్స్ రావు రమేష్(Rao Ramesh), అన్షు(Anshu) ప్రధాన పాత్రల్లో నటిస్తు్న్నారు. ఎ కె ఎంటర్‌టైన్‌మెంట్స్, హాస్య మూవీస్, జీ స్టూడియోస్ బ్యానర్స్‌పై రాజేష్ దండ, ఉమేష్ కె ఆర్ బన్సాల్ నిర్మిస్తున్న ఈ మాస్ ఎంటర్‌టైనింగ్ నుంచి ఇప్పటికే వచ్చిన ప్రతి అప్‌డేట్ ఆకట్టుకున్నాయి. శివరాత్రి (Shivratri) స్పెషల్‌గా ఫిబ్రవరి 26న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధం అయింది. ఇక రిలీజ్ సమయం దగ్గర పడటంతో వరుస ప్రమోషన్స్‌లో పాల్గొంటూ సందడి చేస్తున్నారు చిత్ర బృందం. ఈ క్రమంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సందీప్ కిషన్ మెగాస్టార్ చిరంజీవిపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.

‘ఒకసారి ‘మజాకా’ షూటింగ్ సమయంలో పక్కనే ‘విశ్వంభర’ (Viswambhara) షూట్ కూడా జరుగుతోంది. అప్పుడు అనుకోకుండా మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi)ని కలిశాను. ‘మజాకా’ కథ చేస్తున్నందుకు నన్ను మెచ్చుకున్నారు. అంతే కాకుండా ‘సంజయ్‌తో నువ్వు సినిమా చేస్తున్నావని తెలిసింది. ఒక తెలుగు హీరోతో వాళ్లు సినిమా చేయాలనుకుంటున్నారంటే మనం గర్వపడాల్సిన విషయం’ అన్నారు. ఆ మాట చాలు. అలాంటి మాటలే కదా మనం ఆయన నుంచి వినాలని అనుకుంటాము’ అంటూ చెప్పుకొచ్చాడు. ప్రజెంట్ ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. కాగా.. కోలీవుడ్ స్టార్ హీరో విజయ్‌ తనయుడు జేసన్‌ సంజయ్‌ దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయమవుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో సందీప్ కిషన్ హీరో కాగా.. లైకా ప్రొడక్షన్స్‌ నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది.



Next Story

Most Viewed