- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Samantha: ఎప్పటికీ నీ అభిమానినే అంటూ టాలీవుడ్ హీరోపై సమంత ఇంట్రెస్టింగ్ పోస్ట్
దిశ, సినిమా: నేడు టాలీవుడ్ స్టార్ హీరో దగ్గుబాటి రానా (Rana Daggubati )పుట్టినరోజు కావడంతో అభిమానులు, సినీ సెలబ్రిటీలు విషెస్ తెలుపుతూ పోస్టులు పెడుతున్నారు. ఇప్పటికే పలువురు సినీ తారల తమదైన శైలిలో విషెస్ తెలపగా.. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత(Samantha), రానాకు ప్రత్యేకంగా బర్త్ డే విషెసం తెలుపుతూ పోస్ట్ షేర్ చేసింది. ‘‘హ్యాపీ బర్త్ డే రానా. నువ్వు చేసే ప్రతి పనిలోనూ వందశాతం ఫోకస్ పెడుతుంటావు. ఈ విషయంలో నీ నుంచి నేను ఎంతో స్ఫూర్తి పొందాను. ఎప్పటికీ నేను నీ అభిమానినే.
దేవుడు ఆశీర్వాదం నీకు ఎప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను’’ అని రాసుకొచ్చింది. అంతేకాకుండా హార్ట్ సింబల్స్ షేర్ చేసింది. ప్రజెంట్ సమంత పోస్ట్ నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తోంది. అయితే సమంత, రానా కలిసి ‘బెంగళూరు డేస్’(Bangalore Days) అనే రీమేక్ సినిమాలో నటించారు. ఇక ఈ మూవీ షూటింగ్ సమయం నుంచే వీరిద్దరి మధ్య మంచి బాండింగ్ ఏర్పడింది. అప్పటి నుంచి ఆయనను సామ్ అన్న అని పిలుస్తుంది. ఇదే విషయాన్ని పలు ఈవెంట్స్‌లోనూ వెల్లడించింది.