Salman Khan: రూ. 100 కోట్లతో నిర్మించిన సల్మాన్ ఖాన్ ఫ్లాట్ చూస్తే కళ్లు చెదిరిపోవాల్సిందే.. ఇన్సైడ్ పిక్స్ వైరల్

by Anjali |   ( Updated:2024-12-14 08:59:59.0  )
Salman Khan: రూ. 100 కోట్లతో నిర్మించిన సల్మాన్ ఖాన్ ఫ్లాట్ చూస్తే కళ్లు చెదిరిపోవాల్సిందే.. ఇన్సైడ్ పిక్స్ వైరల్
X

దిశ, వెబ్‌డెస్క్: సాధారణంగానే కొంతమంది సినీ సెలబ్రిటీలు(Movie celebrities) విలాసవంతమైన బంగ్లాలు కొనుగోలు చేస్తుంటారు. పలువురు తమకు నచ్చిన విధంగా ఇల్లు కట్టిస్తారు. అవి చూడానికి రెండు కళ్లు సరిపోవు. అంతలా ఆకట్టుకునేలా హంగులతో చూడచక్కగా ఉంటాయి. అయితే కోట్లలో విలువ చేసే అపార్ట్‌మెంట్‌(Apartment)ను బాలీవుడ్ ప్రముఖ హీరో సల్మాన్ ఖాన్(Salman Khan) కట్టించిన విషయం తెలిసిందే. ముంబయి(Mumbai)లోని బాంద్రా(Bandra)లో 100 కోట్ల రూపాయలతో విలాసవంతమైన అపార్ట్‌మెంట్ నిర్మించారు.

ఇది అత్యాధునిక హంగులతో కిచెన్ డిజైన్ చేశారు. అంతేకాకుండా సల్మాన్ ఖాన్ ప్రతిరోజూ ఉదయం యోగా(Yoga) చేయడానికి ఓ ప్రత్యేక స్థలం కూడా జనాల్ని విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఇక బాల్కనీ(balcony) విషయానికొస్తే.. బాల్కనీ నుంచి చూస్తే.. సముద్రం(sea) కనిపిస్తుంది. ఈ విలాసవంతమైన ఇంట్లో మోడ్రన్ ఆర్ట్(Modern art) కూడా ఉండటం విశేషం. అత్యాధునిక సౌకర్యాలతో బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ ఎంతో అట్రాక్టింగ్‌గా ఇంటీరియల్ డిజైన్(Interior design) చేయించుకున్నారు. ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియాలోని జనాల్ని విపరీతంగా ఆకట్టుకున్నాయి.

Advertisement

Next Story

Most Viewed