- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
Saif Ali Khan: సైఫ్ అలీఖాన్‌పై దాడి కేసులో కీలక పరిణామం.. 36 గంటల్లోనే నిందితుడి అరెస్ట్

దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ (Saif Ali Khan)పై దాడి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. కేసును సవాలు తీసుకున్న ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు (Mumbai Crime Branch Police) కేవలం 36 గంటల వ్యవధిలో నిందితుడిని అరెస్ట్ చేశారు. అయితే, నిందితుడిని నేరుగా బాంద్రా పోలీస్ స్టేషన్ (Bandra Police Station)కు తీసుకెళ్లి అక్కడే విచారిస్తున్నారు. సైఫ్‌పై దాడికి పాల్పడిన వెంటనే దుండగుడు తొలుత ముంబై లోకల్ ట్రెయిన్ (Local Train)లో ప్రయాణించినట్లుగా పోలీసులు సీసీ టీవీ ఫుటేజ్ ద్వారా గుర్తించి అతడిని అదుపులోకి తీసున్నట్లుగా ప్రాథమికంగా తెలుస్తోంది.
కాగా, గురువారం తెల్లవారుజామున బాంద్రా (Bandra)లోని ఫార్చ్యూన్ హైట్స్ (Fortune Heights)11వ ఫ్లోర్‌లో నివాసం ఉంటున్న సైఫ్ అలీఖాన్ (Saif Ali Khan) ఇంట్లోకి తెల్లవారుజామున 2.30కి దుండగుడు ప్రవేశించాడు. అనంతరం అతడు సైఫ్ చిన్న కుమారుడు జేహ్ (Jeh) గదిలోకి వెళ్లగా అక్కడ కేర్ టేకర్ (Care Taker) అడ్డుకుంది. ఆమెపై దాడి జరుగుతోన్న సమయంలోనే మరో గదిలో ఉన్న సైఫ్ బయటకు వచ్చి దుండగుడిని అడ్డుకోబోయాడు. ఈ క్రమంలోనే నిందితుడు సైఫ్‌పై కత్తితో విచక్షణారహితంగా దాడికి పాల్పడి అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ దాడిలో సైఫ్ మెడ, వెన్నుముక భాగంతె కలిపి మొత్తం ఆరు చోట్ల తీవ్ర గాయాలయ్యాయి. అప్రమత్తమైన సైఫ్ పెద్ద కొడుకు ఇబ్రహీం అలీఖాన్ (Ibrahim Ali Khan) తన తండ్రిని ఆటోలో హుటాహుటిన లీలావతి ఆసుపత్రికి తరలించాడు. మొత్తం సైఫ్‌కు రెండు కీలక సర్జరీ చేశారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు ప్రకటించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న ముంబై క్రైం బ్రాంచ్ పోలీసులు మొత్తం ఏడు బృందాలతో నిందితుడి కోసం గాలించారు. ఇవాళ ఉదయం బాంద్రా పరిసర ప్రాంతంలో నిందితుడి అదుపులోకి తీసుకున్నారు.