Sai Pallavi: ‘అనుమతి లేకుండా ఆ పని చేస్తే నాకు అస్సలు నచ్చదు’.. నేచురల్ బ్యూటీ షాకింగ్ కామెంట్స్

by Kavitha |
Sai Pallavi: ‘అనుమతి లేకుండా ఆ పని చేస్తే నాకు అస్సలు నచ్చదు’.. నేచురల్ బ్యూటీ షాకింగ్ కామెంట్స్
X

దిశ, సినిమా: ‘ప్రేమమ్’(Premam) సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన నేచురల్ బ్యూటీ సాయి పల్లవి(Sai Pallavi) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన ఫస్ట్ మూవీతోనే మంచి ఫేమ్ తెచ్చుకుంది. ఇక వరుణ్ తేజ్(Varun Tej) సరసన ‘ఫిదా’(Fidaa) చిత్రంలో నటించి అందరినీ ఫిదా చేసేసింది. అయితే సినిమాల్లో మేకప్ ఎక్కువగా వేసుకోకపోవడం, బోల్డ్ సీన్స్‌లో యాక్ట్ చేయకపోవడం వంటి కారణాల వల్ల ఈ భామపై మరింత రెస్పెక్ట్ పెరిగింది. ఇక ఈ అమ్మడు డ్యాన్స్‌(Dance)కి అయితే ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందనే చెప్పాలి. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ నాగచైతన్య(Naga Chaitanya) సరసన ‘తండేల్’(Thandel) మూవీతో పాటు, బాలీవుడ్‌లో ‘రామాయణం’(Ramayanam) మూవీలో నటిస్తోంది. ఈ క్రమంలో ఈ అమ్మడు చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సాయి పల్లవి షాకింగ్ కామెంట్స్ చేసింది. ఆమె మాట్లాడుతూ.. “పబ్లిక్ ప్లేస్‌లోకి వెళ్లినప్పుడు అందరూ నన్నే చూస్తుంటారు. అప్పుడు కాస్త భయంగానూ, బిడియంగానూ ఉంటుంది. ఎవరైన అభినందించినా కూడా తెలియని టెన్షన్. అన్నిటికంటే ముఖ్యంగా నా పర్మిషన్ లేకుండా ఎవరైనా నా ఫొటోలు తీస్తే అస్సలు నచ్చదు, అడిగి తీసుకుంటే బాగుంటుంది కదా. ఒక్కోసారి ఓవర్‌థింకింగ్ వల్ల ఆలోచనలు ఎక్కడికో వెళ్ళిపోతాయి, వాటిని నియంత్రించుకోవడానికి నిత్యం ధ్యానం చేస్తాను” అని చెప్పుకొచ్చింది సాయి పల్లవి. ప్రస్తుతం ఈ భామ చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Advertisement
Next Story

Most Viewed