RGV: పుష్ప 2 ఇడ్లీలు.. టికెట్ ధరల పెంపుపై ఆర్జీవీ షాకింగ్ కామెంట్స్

by Ramesh Goud |   ( Updated:2024-12-04 16:21:47.0  )
RGV: పుష్ప 2 ఇడ్లీలు.. టికెట్ ధరల పెంపుపై ఆర్జీవీ షాకింగ్ కామెంట్స్
X

దిశ, వెబ్ డెస్క్: పుష్ప 2(Pushpa-2) ఇడ్లీలు అంటూ.. పుష్ప-2 సినిమా టికెట్ ధరలపై(Ticket Charges) సంచలన డైరెక్టర్ రామ్‌గోపాల్ వర్మ(Director Ram Gopal Varma) షాకింగ్ కామెంట్స్(Shocking Comments) చేశారు. ఈ సందర్భంగా టికెట్ చార్జీ పెంపుపై ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. విమర్శలకు చెక్ పెట్టారు. సుబ్బారావు అనే ఒకడు ఒక ఇడ్లీ హోటల్ పెట్టి , ప్లేట్ ఇడ్లీల ధరను రూ. 1000గా పెట్టాడని, సుబ్బారావు అంత ధర పెట్టడానికి కారణం, వాడి ఇడ్లీలు మిగతావాటి ఇడ్లీల కంటే చాలా గొప్పవని నమ్ముతున్నాడని తెలిపారు. కానీ కస్టమర్‌కు సుబ్బారావు ఇడ్లీలు అంత వర్త్ అనిపించకపోతే, వాడు సుబ్బారావు హోటల్‌కు వెళ్లడు. దాంతో నష్టపోయేది సుబ్బారావు ఒక్కడే తప్ప, ఇంకెవ్వరూ కాదని స్పష్టం చేశారు. అలాగే “సుబ్బారావు ఇడ్లీల ధర సామాన్య ప్రజల అందుబాటులో లేదు” అని ఎవరైనా ఏడిస్తే , అది “సెవెన్‌స్టార్ హోటల్ సామాన్యులకు అందుబాటులో లేదు” అని ఏడ్చినంత వెర్రితనం అని ఎద్దేవా చేశారు.

ఒకవేళ “సెవెన్‌స్టార్ హోటల్‌లో అంబియన్స్‌కి మనం ధర చెల్లిస్తున్నాం” అని వాదిస్తే, పుష్ప 2 విషయంలో ఆ సెవెన్‌స్టార్ క్వాలిటీ అనేది ఆ సినిమాఏ అని చెప్పారు. డెమొక్రాటిక్ క్యాపిటలిజం అనేది క్లాస్ డిఫరెన్స్ మీదే పనిచేస్తుందని, అన్ని ప్రొడక్ట్స్ లాగే సినిమాలు కూడా లాభాల కోసమే నిర్మించబడతాయని, అంతే కానీ ప్రజా సేవ కోసం కాదని, అప్పుడు లగ్జరీ కార్లపై, విలాసవంతమైన భవనాలపై, బ్రాండెడ్ బట్టలపై ఎలాంటి ఏడుపూ ఏడవనోళ్లు సినిమా టికెట్ ధరల మీదే ఎందుకు ఏడుస్తున్నారు? అని మండిపడ్డారు. ఎంటర్టైన్మెంట్ నిత్యావసరమా?, ఇల్లు, తిండి, బట్టలు ఈ మూడింటి కన్నా ఎక్కువ అవసరమా? అలా అయితే ఈ మూడు నిత్యావసరాల ధరలు బ్రాండింగ్ వున్నప్పుడు, ఆకాశాన్ని తాకుతుంటే, ఆకాశం లాంటి పుష్ప 2 సినిమాకి ఇప్పుడు పెట్టిన రేట్లు కూడా తక్కువే అని వివరించారు. అలా అనుకొని వారు చూడటం మానెయ్యొచ్చూ , లేదా తర్వాత రేట్లు తగ్గాక చూసుకోవచ్చు కదా? అని అన్నారు. ఇక మళ్లీ సుబ్బారావు హోటల్ చైన్ విషయానికి వస్తే ఇడ్లీ ధర ఇప్పటికే వర్కౌట్ అయిపోయిందని, దానికి ప్రూఫ్ ఏమిటంటే సుబ్బారావు ఏ హోటల్లో కూడా కూర్చునే చోటు దొరకడం లేదని, అన్ని సీట్లు బుక్ అయిపోయాయని చెబుతూ.. ఆర్జీవీ(RGV) పుష్ప టీం(Pushpa Team) కు అండగా నిలిచారు.

Read More...

RGV: పుష్ప-2 సినిమాపై రామ్ గోపాల్ వర్మ సంచలన ట్వీట్..!


Advertisement

Next Story