Renu Desai: బిగ్ గుడ్ న్యూస్ ప్రకటించిన రేణు దేశాయ్.. అస్సలు ఊహించలేదుగా అంటున్న నెటిజన్లు (పోస్ట్)

by Hamsa |
Renu Desai: బిగ్ గుడ్ న్యూస్ ప్రకటించిన రేణు దేశాయ్.. అస్సలు ఊహించలేదుగా అంటున్న నెటిజన్లు (పోస్ట్)
X

దిశ, సినిమా: పవన్ కళ్యాణ్(Pawan Kalyan) మాజీ భార్య రేణు దేశాయ్(Renu Desai) గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు. వీరిద్దరు ప్రేమించి పెళ్లి చేసుకుని కొద్ది కాలం పాటు కలిసి ఉన్నారు. అయితే వీరికి ఆద్య, అకీరా నందన్(Akira Nandan) అనే ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. కానీ కొన్నేళ్లకు మనస్పర్థలు రావడంతో విడాకులు తీసుకుని విడిపోయారు. ఇక అప్పటి నుంచి రేణు దేశాయ్ పిల్లల బాధ్యతను తీసుకుని కొన్నేళ్లు సినిమాలకు దూరంగా ఉంది. మళ్లీ 2023లో ఆమె రవితేజ (Ravi Teja)‘టైగర్ నాగేశ్వరరావు’(Tiger Nageswara Rao) సినిమాతో రీఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత మళ్లీ ఇండస్ట్రీకి దూరం అయి ఓ ఎన్జీవో ని స్టార్ట్ చేసి జంతువులను కంటికి రెప్పలా చూసుకుంటుంది.

అలాగే శ్రీఆద్య పేరుతో ఓ వెబ్‌సైట్ స్టార్ట్ చేసింది. నిత్యం జంతువులను హింసించే వారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ వారికి శిక్షించేలా పోరాటం చేస్తుంది. అలాగే అకీరా గురించి పవన్ ఫ్యాన్స్ ఏదైనా అంటే వారికి స్ట్రాంగ్ కౌంటర్లు వేస్తూ వార్తల్లో నిలుస్తోంది. అయితే ఇటీవల రేణు దేశాయ్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొనగా.. మళ్లీ ఇండస్ట్రీకి రీ ఎంట్రీ ఇస్తారా అనే ప్రశ్న ఎదురైంది. దీంతో ఆమె ఎన్నిసార్లు ఇవ్వాలని సమాధానం చెప్పి షాకిచ్చిన విషయం తెలిసిందే. దీంతో ఆమె పూర్తిగా ఇండస్ట్రీకి దూరం అయినట్టే ఇక అని అంతా ఫిక్స్ అయిపోయారు.

ఇదిలా ఉంటే.. తాజాగా, రేణు దేశాయ్ ఊహించని విధంగా బిగ్ గుడ్ న్యూస్ ప్రకటించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసిందనడంలో అతిశయోక్తి లేదు. ఎన్నిసార్లు రీఎంట్రీ ఇవ్వాలని చెప్పిన ఆమె ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఏదో షూటింగ్ స్టార్ట్ అయినట్లు వెల్లడించింది. అందులో భాగంగా ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్నట్లు తెలుపుతూ బ్రేక్ టైమ్‌లో స్నాగ్స్ తిన్నట్లు ఫొటో షేర్ చేసింది. అలాగే క్యారవాన్ పిక్‌ను కూడా నెట్టింట పెట్టింది. దీంతో ఆమె ఏదో సినిమాలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆమె పోస్ట్ వైరల్ అవుతుండగా.. అది చూసిన వారంతా అస్సలు ఊహించలేదు బిగ్ సర్‌ప్రైజ్ ఇవ్వబోతుంది కావచ్చని అంటున్నారు.

Next Story