Renu Desai: అకీరాది పవన్ స్టైల్.. సిగ్గు ఎందుకు.. స్ట్రాంగ్‌గా ఇచ్చిపడేసిన రేణు దేశాయ్(వీడియో)

by Kavitha |   ( Updated:2024-12-13 10:40:33.0  )
Renu Desai: అకీరాది పవన్ స్టైల్.. సిగ్గు ఎందుకు.. స్ట్రాంగ్‌గా ఇచ్చిపడేసిన రేణు దేశాయ్(వీడియో)
X

దిశ, సినిమా: పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణుదేశాయ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ‘జానీ’, ‘బద్రి’ వంటి సినిమాల్లో పవన్‌ కళ్యాణ్ సరసన నటించి అతన్ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. కానీ కొన్ని కారణాల రీత్యా విడాకులు తీసుకుని వేరుగా ఉంటున్నారు. ఇక విడాకుల తర్వాత పవన్‌ కళ్యాణ్ మరో పెళ్లి చేసుకుని ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎంగా వ్యవహరిస్తున్నాడు. ఇక రేణు దేశాయ్ మాత్రం మరో పెళ్లి చేసుకోకుండా తమ పిల్లల (ఆద్య, అకిరా నందన్) బాధ్యతలను చూసుకుంటుంది. అలాగే నిత్యం సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ.. పేద పిల్లలకు, జంతువులకు సహాయం చేస్తుంది. తనకు తోచినంత సహాయం చేయడంతో పాటుగా.. తన ఫ్యాన్స్‌ను కూడా విరాళాలు అడుగుతూ గుడ్ హ్యూమన్ బీయింగ్ అనిపించుకుంటుంది. అలాగే సోషల్ మీడియాలో పలు పోస్టులు పెడుతూ వార్తల్లో నిలుస్తూ ఉంటుంది.

ఇదిలా ఉంటే.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రేణు దేశాయ్ భారతీయుల వస్త్రధారణ, ఖాదీ దుస్తుల గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. పవన్ గతంలోనూ ఖాదీ బట్టలు ఎక్కువగా వేసుకునేవారని రేణు దేశాయ్ గుర్తు చేశారు. అకీరా కూడా లుంగీ, ధోతిలో కనిపిస్తాడని.. నేను వాడిని మరింత ప్రోత్సహిస్తానని ఆమె తెలిపారు. ఇందులో సిగ్గు పడేది ఏం లేదని.. ప్యాంట్స్ మన కల్చర్ కాదని ధోతి, లుంగిలే మన సంస్కృతి అని రేణు దేశాయ్ వెల్లడించారు. అలా మన సంస్కృతిని మనం ఓన్ చేసుకోవాలని.. ధోతి, లుంగీలు వేసుకోవడానికి సిగ్గు పడొద్దని ఆమె యువతరానికి పిలుపునిచ్చారు. ప్రస్తుతం ఈమె చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారగా.. దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.

Advertisement

Next Story