- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Ranbir Kapoor: ‘బ్రహ్మాస్త్ర 2’పై సాలిడ్ అప్డేట్ ఇచ్చిన రణ్బీర్.. ఆనందంలో ఫ్యాన్స్

దిశ, సినిమా: బాలీవుడ్ (Bollywood) స్టార్ అండ్ క్యూట్ కపుల్స్లో అలియా భట్ (Alia Bhatt), రణ్బీర్ కపూర్ (Ranbir Kapoor) జంట ఒకటి. ఇక అలియా బర్త్డే ఈనెల 15న కావడంతో.. అప్పుడే ప్రీ బర్త్డే సెలబ్రేషన్స్ (Pre-Birthday Celebrations) స్టార్ట్ అయ్యాయి. ఇందులో భాగంగా తాజాగా కేక్ కట్ చేసి మీడియాతో ముచ్చటించిన అలియా భట్, రణ్బీర్ కపూర్ ‘బ్రహ్మస్త్ర 2’ పై సాలిడ్ అప్డేట్ ఇచ్చారు.
రణ్బీర్ మాట్లాడుతూ.. ‘‘బ్రహ్మాస్త్ర’(Brahmastra) అనేది అయాన్ ముఖర్జీ డ్రీమ్ ప్రాజెక్ట్. ఆయన అనుకున్న కథలో కొంత భాగాన్ని మాత్రమే మనం చూశాం. అసలు కథ సిద్ధం అవ్వడానికి రెడీ అవుతుంది. మీరు అనుకుంటున్నట్లుగా అయాన్ ప్రస్తుతం ‘వార్ 2’ (War 2) షూటింగ్ పనుల్లో బిజీగా ఉన్నారు. అది విడుదలైన తర్వాత, అతను బ్రహ్మాస్త్ర 2 పై పని చేయడం ప్రారంభిస్తాడు. ఇది ఖచ్చితంగా జరుగుతుంది. అయితే.. ఇప్పుడు మేము దాని గురించి పెద్దగా చెప్పలేము.. కానీ, ‘బ్రహ్మాస్త్ర 2’ (Brahmastra 2) ఖచ్చితంగా జరుగుతోంది. త్వరలో కొన్ని అప్డేట్స్ కూడా వస్తాయి. అవి మీరు చూస్తారు’ అంటూ చెప్పుకొచ్చాడు. బాలీవుడ్ సైన్స్ ఫిక్షన్ చిత్రంగా ‘బ్రహ్మాస్త్ర’ తెరకెక్కింది. ఇందులో రణ్బీర్ కపూర్, అలియా భట జంటగా నటించగా.. అయాన్ ముఖర్జీ (Ayan Mukherjee) దీనికి దర్శకత్వం వహించారు. 2022లో రిలీజైన ఈ మూవీ బాలీవుడ్తో పాటు టాలీవుడ్లో కూడా మంచి విజయాన్ని అందుకుంది. ఇక బాలీవుడ్లో అయితే.. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షాన్ని కురిపించి సూపర్ హిట్ చిత్రంగా నిలిచింది. అలాంటి మూవీకి ఇప్పుడు సీక్వెల్ (sequel) తెరకెక్కబోతుందని రణ్బీర్ అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇవ్వడంతో ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం వేస్తుంది.
Read More..
ఆ సినిమాలో సమంత గెస్ట్ రోల్..? క్యూరియాసిటీ పెంచేస్తున్న న్యూస్