‘రామాయణ’కు ఆస్కార్ కచ్చితంగా వస్తుంది.. అదే మా లక్ష్యం.. నిర్మాత ఆసక్తికర కామెంట్స్

by Kavitha |
‘రామాయణ’కు ఆస్కార్ కచ్చితంగా వస్తుంది.. అదే మా లక్ష్యం.. నిర్మాత ఆసక్తికర కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: రాకింగ్ స్టార్ యష్ నటిస్తున్న అతి పెద్ద ప్రాజెక్ట్ ‘రామాయణం’ (Ramayanam). బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ నితీష్ తివారి(Nithish Tiwari) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని నమిత్ మల్హోత్రా(Namit Malhothra)తో కలిసి అల్లు అరవింద్ అత్యంత భారీ బడ్జేట్‌తో నిర్మిస్తున్నారు. ఇక ఈ మూవీలో రాముడిగా రణబీర్ కపూర్(Ranbeer Kapoor), సీతగా సాయిపల్లవి(Sai pallavi), రావణుడిగా యష్ నటిస్తున్నారు.

ఇప్పటికే ఈ సినిమా నుంచి లీకైన ఫొటోస్‌లో సీతా రాములుగా రణబీర్, సాయిపల్లవి చూడడానికి ఎంతో అందంగా కనిపించారు. అయితే ఇప్పటివరకు హీరోగా చేసిన యష్ ఫస్ట్ టైం రావణుడిగా విలన్ క్యారెక్టర్‌లో కనిపించనుండటంతో ఈ చిత్రంపై అంచనాలు ఆకాశాన్ని దాటాయి. కాగా ఈ సినిమా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుండగా.. ఫస్ట్ పార్ట్ వచ్చే ఏడాది(2026) దీపావళికి రిలీజ్ కానుంది. ఇక సెకండ్ పార్ట్ 2027 దీపావళికి రిలీజ్ కానుంది.

ఇదిలా ఉంటే.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నిర్మాత నమిత్ మల్హోత్రా ఈ చిత్రం గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ‘రామాయణకు కచ్చితంగా ఆస్కార్ వస్తుందనే నమ్మకం నాకు ఉంది. ఇందులో విజువల్స్‌కు అధిక ప్రాధాన్యం ఇస్తున్నాం. అందుకే ఆస్కార్ సాధించగలదనే విషయంలో ఎలాంటి సందేహం లేదు. నిజం చెప్పాలంటే ఇది పూర్తిగా మన పైనే ఆధారపడి ఉంది. మనం సినిమాను ఏ స్థాయిలో ప్రచారం చేస్తామనేది ముఖ్యం. ప్రచారం చేయడం పెద్ద బాధ్యత. ఇటీవల ఓ అగ్రహీరో రామాయణం కథను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు.

ఆ చిత్రం తీవ్ర విమర్శలు ఎదుర్కొంది. దాన్ని దృష్టిలో పెట్టుకునే మేం మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ఇది సున్నితమైన కథ. ప్రజల మనోభావాలు దెబ్బ తినకుండా దీన్ని తెరకెక్కించాలి. ఈ అవకాశం మళ్లీ రాదు. అందుకే జాగ్రత్తగా రూపొందిస్తున్నాము. రామాయణతో భారతీయ కథకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తీసుకురావడమే మా లక్ష్యం’ అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం నమిత్ మల్హోత్ర చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారాయి.


Next Story