భారీ ప్లాన్‌లో రాజ్ అండ్ డీకే.. రెడీ అవుతున్న ఫ్యామిలీ మ్యాన్‌3

by Disha News Desk |
The family man 2 poster
X

దిశ, వెబ్‌డెస్క్: 'ది ఫ్యామిలీ మ్యాన్' ఓటీటీలో భారీ క్రేజ్ అందుకున్న వెబ్‌సిరీస్‌ల్లో ఒకటి. ఈ వెబ్ సిరీస్ కోసం అభిమానులు వేయి కళ్లతో ఎదురుచూశారు. మొదటి సీజన్ నుంచే అందరినీ ఆకట్టుకుంటున్న 'ది ఫ్యామిలీ మ్యాన్' సెకండ్ సీజన్‌తో ఔరా అనిపించింది. ఈ సీజన్ ఎండింగ్‌తో అభిమానులు మూడో సీజన్ ఉంటుందని భావించారు. కానీ ఇప్పటివరకు మేకర్స్ రాజ్ అండ్ డీకే ఏ క్లారిటీ ఇవ్వలేదు. అయితే తాజా సమాచారం ప్రకారం రాజ్ అండ్ డీకే 'ది ఫ్యామిలీ మ్యాన్ 3' స్క్రిప్ట్ విషయంలో ఫుల్ బిజీగా ఉన్నారట. మొదటి రెండు సీజన్‌ల తల తన్నేలా మూడో సీజన్‌ను రెడీ చేస్తున్నారంటూ టాక్ నడుస్తోంది.

దాంతో పాటుగా ఈ సీజన్ షూటింగ్ ఈ ఏడాది చివర్లో ప్రారంభం కావచ్చని, ప్రస్తుతం స్క్రిప్ట్ రెడీ అవుతోందని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మూడో సీజన్ అంతా కూడా కోల్‌కతా చుట్టుపక్కల సాగనుందని గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే ప్రస్తుతం రాజ్ అండ్ డీకే తమ నెక్స్ట్ వెబ్ సిరీస్‌తో బిజీగా ఉన్నారు. ఇందులో రాశీ ఖన్నా, షాహిద్ కపూర్, విజయ్ సేతుపతి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ వెబ్ సిరీస్ అనంతరం ఫ్యామిలీ మ్యాన్ 3 ప్రారంభం కానుందట. ఇప్పటి వరకు దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రాలేదు. త్వరలో ఏమైనా క్లారిటీ వస్తుందేమో చూడాలి.

Advertisement

Next Story