గార్జియస్ లుక్‌లో దర్శనమిచ్చిన రాధిక.. నిన్ను టిల్లు ఇలా చూస్తే నీ పని దబిడి దిబిడే అంటున్న నెటిజన్లు

by Kavitha |   ( Updated:2025-03-13 03:09:53.0  )
గార్జియస్ లుక్‌లో దర్శనమిచ్చిన రాధిక.. నిన్ను టిల్లు ఇలా చూస్తే నీ పని దబిడి దిబిడే అంటున్న నెటిజన్లు
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ క్రేజియస్ట్ హీరోయిన్ నేహా శెట్టి(NEHA SHETTY) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ‘మెహబూబా’(Mehabooba) సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ భామ తన ఫస్ట్ సినిమాతో ఓకే ఓకే అనిపించుకుంది. ఆ తర్వాత ‘డీజే టిల్లు’(DJ Tillu) మూవీతో ఓవర్ నైట్ స్టార్‌గా మారిపోయింది. స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ(Sidhu Jonnalagadda) సరసన రాధిక(Radhika) పాత్రలో నటించి మెప్పించింది. అంతేకాకుండా తన నటనతో అందరినీ మంత్రముగ్ధులను చేసింది. ఇప్పటికీ ఈ బ్యూటీని రాధిక అనే అంటారనడంలో ఏమాత్రం సందేహం లేదు.

అలాగే రీసెంట్‌గా వచ్చిన ‘టిల్లు స్క్వేర్’(Tillu Square) మూవీలో క్లైమాక్స్ సీన్‌లో కనిపించి అలరించింది. దీంతో ఈ భామకు వరుస ఆఫర్లు క్యూ కడుతున్నాయి. కానీ అవి అనుకున్నంతగా హిట్ అయితే కాలేదు. దీంతో సోషల్ మీడియా(Social Media)లో నిత్యం యాక్టీవ్‌గా ఉంటూ లేటెస్ట్ ఫొటో షూట్స్, వ్యక్తిగత విషయాలను పంచుకుంటూ అభిమానులకు దగ్గరవుతూ ఉంటుంది. ఈ క్రమంలో ఈ భామ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది.

తాజాగా నేహా శెట్టి తన ఇన్‌స్టాగ్రామ్(Instagram) వేదికగా కొన్ని ఫొటోలు షేర్ చేసింది. అందులో గ్రీన్ కలర్ డ్రెస్ వేసుకుని అచ్చం మహారాణిలా రెడీ అయింది. అయితే ఆ ఫొటోస్‌ను షేర్ చేస్తూ.. ‘మళ్ళీ చూడదగ్గ ఇష్టమైన లుక్’ అనే క్యాప్షన్ జోడించింది. దీంతో ఈ పిక్స్ కాస్తా నెట్టింట వైరల్‌గా మారాయి. ఇక వాటిని చూసిన నెటిజన్లు నిన్ను ఇలా టిల్లు అన్న చూస్తే నీకు దబిడి దిబిడే అంటూ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ ముద్దుగుమ్మ పోస్ట్ పై మీరు ఓ లుక్ వేసేయండి.

Read More..

ఇన్నర్ పార్ట్ కనిపించేలా హాట్ స్టిల్స్ ఇచ్చిన పవన్ కళ్యాణ్ బ్యూటీ.. నీ యవ్వ తగ్గేదేలే అంటున్న నెటిజన్లు

Next Story

Most Viewed