- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
ఎట్టకేలకు పెళ్లి పీటలెక్కిన పుష్ప నటుడు.. న్యూ కపుల్‌కు కంగ్రాట్స్ చెబుతున్న నెటిజన్లు

దిశ, సినిమా: ప్రస్తుతం కాలంలో చాలా మంది తమ బ్యాచిలర్ లైఫ్‌కి గుడ్ బై చెప్పి వివాహ బంధంతో ఓ ఇంటి వారవుతున్నారు. అందులో కొంత మంది లవ్ మ్యారేజ్ చేసుకుంటుంటే మరికొంత మంది పెద్దలు కుదిర్చిన సంబంధాలను చేసుకుంటున్నారు. అలా ప్రస్తుతం ఓ నటుడు కూడా తన బ్యాచిలర్ లైఫ్‌కి స్వస్థి చెప్పి మూడు ముళ్ళ బంధంతో ఓ ఇంటివాడు అయ్యాడు. మరి ఇంతకీ అతను ఎవరు ఏంటి ఆ వివరాలు అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం.
సుకుమార్(Sukumar) డైరెక్షన్‌లో అల్లు అర్జున్(allu Arjun) హీరోగా రష్మిక మందన్న(Rashmika Mandanna) హీరోయిన్‌గా నటించిన మూవీ ‘పుష్ప’(Pushpa). ఈ సినిమా ఎంతగా హిట్ అయిందో మనందరికీ తెలిసిందే. అయితే ఈ మూవీలో తన నటనతో ఒక్కసారిగా ఓవర్ నైట్ స్టార్‌గా మారిన డాలీ ధనంజయ్(Dhanunjay) అందరికీ తెలిసిందే. ధనంజయ్ అంటే ఠక్కున గుర్తుకు రాకపోవచ్చు కానీ జాలి రెడ్డి(Jali Raddy) అంటే మాత్రం ఇట్టే గుర్తుపట్టేస్తారు. ఇక జాలి రెడ్డిగా తన నటన, విలనిజంతో మంచి ఫేమ్ తెచ్చుకున్న ధనంజయ్.. ధన్యత(Dhanyatha) అనే అమ్మాయితో గత కొంత కాలంగా ప్రేమలో ఉన్నాడు.
అయితే రీసెంట్‌గా ఇంట్లో పెద్దలను ఒప్పించి ఎంగేజ్‌మెంట్(Engegment) కూడా చేసుకున్నాడు. ఇక అప్పటినుంచి తన పెళ్లికి సంబంధించిన ప్రతి అప్డేట్‌ను సోషల్ మీడియాలో పంచుకుంటున్నాడు. ఇందులో భాగంగా రీసెంట్‌గా తన మ్యారేజ్ ఫిబ్రవరి 15, 16తేదిల్లో జరగనుందని తెలుపుతూ ఇన్‌స్టా గ్రామ్(Instagram) ద్వారా ఓ స్పెషల్ పోస్టర్‌ను షేర్ చేశాడు.
ఈ క్రమంలో తాజాగా ధనుంజయ్ తన ప్రియురాలు ధన్యతతో పెళ్లి పీటలెక్కినాడు. ప్రస్తుతం వీరి మ్యారేజ్‌కు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియా(Social Media)లో వైరల్‌గా మారాయి. అయితే వీరి రిసెప్షన్ పార్టీకి స్పెషల్ గెస్ట్‌గా స్టార్ డైరెక్టర్ సుకుమార్ వెళ్లినట్లు తెలుస్తోంది. ఇక ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు, అతని అభిమానులు హర్షం వ్యక్తం చేస్తూ ఈ నూతన జంటకు కంగ్రాట్స్ చెబుతున్నారు.