Pushpa-2: ఆ పాత్ర పేరుతో అవమానించారు.. పుష్ప-2 నిర్మాతకు బెదిరింపులు

by Ramesh Goud |   ( Updated:2024-12-10 15:46:48.0  )
Pushpa-2: ఆ పాత్ర పేరుతో అవమానించారు.. పుష్ప-2 నిర్మాతకు బెదిరింపులు
X

దిశ, వెబ్ డెస్క్: అల్లుఅర్జున్(Allu Arjun) హీరోగా సుకుమార్(Sukumar) దర్శకత్వంలో ఈ నెల 05న విడుదలైన పుష్ప సీక్వేల్ పుష్ప-2(Pushpa-2) సినిమా రికార్డు స్థాయి కలెక్షన్లతో దూసుకుపోతోంది. ఈ సినిమా విడుదలకు ముందు నుంచే వివాదాల్లో ఉంటూ వస్తోంది. మొదట మూవీ టికెట్స్ పై వివాదం చెలరేగగా.. విడుదల అనంతరం తొక్కిసలాటలో ఒకరు చనిపోవడం సహా పలు వివాదాల్లో ఉంటోంది. ఈ నేపథ్యంలో పుష్ప-2 సినిమాలోని ఓ పాత్ర కొత్త వివాదానికి తెరలేపింది. ఈ పాత్ర విషయంలో మూవీ నిర్మాత మైత్రీ మూవీ మేకర్స్‌(Mythri Movie Makers)పై ఓ వర్గం వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిర్మాతలపై(Producres) దాడి చేస్తామని బెదిరింపులకు గురి చేస్తున్నారు.

ఇందులో మళయాల స్టార్ నటుడు ఫహద్ ఫాజిల్(Fahad Fasil) షెకావత్(Shekavath) పేరుతో పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించాడు. అయితే ఈ సినిమాలో షెకావత్ పేరుతో ఉన్న పాత్రను నెగిటివ్ చూపించి.. తమ వర్గాన్ని అవమానించారని క్షత్రియ కర్ణ సేన(Kshathriya Karna Sena) నాయకుడు రాజ్ షెకావత్(Raj Shekavath) మండిపడుతున్నారు. అంతేగాక కర్ణి సైనికుల్లారా సిద్దంగా ఉండండి.. పుష్ప-2 నిర్మాతలపై దాడికి దిగుదాం అని పిలుపునిచ్చారు. క్షత్రియులను అవమానాలకు గురి చేస్తే సహించేది లేదని రాజ్ షెకావత్ హెచ్చరిస్తూ సోషల్ మీడియాలో వీడియో విడుదల చేశారు. దీనిపై ఫ్యాన్స్ స్పందిస్తూ.. మూడేళ్ల క్రితం విడుదలైన పుష్ప సినిమాలో కూడా షెకావత్ పాత్ర ఉందని, అప్పుడు లేని అవమానం ఇప్పుడు ఎందుకు జరిగిందని కామెంట్లు పెడుతున్నారు.

Read More...

బాక్సాఫీసు వద్ద ‘పుష్ప 2’ హిందీ కలెక్షన్స్ సునామి.. ఐదు రోజుల్లో ఎంత కలెక్ట్ చేసిందంటే..? (పోస్ట్)




Next Story

Most Viewed